Read more!

English | Telugu

ఇంట‌ర్నెట్‌ను తుఫానులా ఊపేస్తోన్న క‌త్రినా-విక్కీ పూల్ పిక్చ‌ర్‌

 

బాలీవుడ్ స్టార్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గత సంవత్సరం రాజస్థాన్‌లో ఒక సన్నిహిత వేడుకలో పెళ్లాడిన‌ప్పుడు చాలా మంది హృదయాలు బద్దలయ్యాయి. అప్పటి నుండి, అభిమానులు వారిని 'విక్‌క్యాట్' అని ప్రేమగా పిలుచుకుంటూ వ‌స్తున్నారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తపరచడంలో వారెప్పుడూ విఫలం కాలేదు. ఒక‌రినొక‌రు ఉత్సాహ‌ప‌రుచుకొనే పిక్చ‌ర్ల నుంచి, త‌మ అంద‌మైన క్ష‌ణాల‌ను షేర్ చేసుకోవ‌డం దాకా ఆ అంద‌మైన జంట పంచుకొనే ప్ర‌తి పోస్ట్ ఫ్యాన్స్‌ను అల‌రిస్తోంది.

ఈ నేప‌థ్యంలో శనివారం (మే 7), కత్రీనా కైఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తన బెటర్ హాఫ్ విక్కీ కౌశ‌ల్‌తో హాట్ హాట్‌ పూల్ పిక్చర్‌ను షేర్‌ చేసింది. ఆ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను సునామీలా ఊపేస్తోంది. ఆ ఫొటో షేర్ చేసిన గంట‌లోపే దానికి 1 మిలియ‌న్ పైగా లైక్స్ వ‌చ్చాయంటే.. అది ఎంత‌గా జ‌నాన్ని కిర్రెక్కిస్తోందో ఊహించుకోవ‌చ్చు. ఆ ఫొటోకు ఆమె "నేను, నావాడు" అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలో స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న విక్కీని ఉద్రేకంతో కౌగిలించుకుంటున్న క‌త్రినాను మ‌నం చూడొచ్చు.

సోష‌ల్ మీడియాలో ఆ స్టీమీ పిక్చ‌ర్‌పై అభిమానులు విప‌రీత‌మైన ప్రేమ‌ను చూపిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ కొన్ని హార్ట్ ఎమోటికాల‌ను వ‌ద‌ల‌గా, హ్యుమా ఖురేషి 'ఆవ్' అంటూ కామెంట్ పెట్టింది. హృతిక్ రోష‌న్ 'సో నైస్' అని రాయ‌గా, ప్రియాంక చోప్రా క‌న్ను ఉన్న హార్ట్ ఎమోటికాను కామెంట్ సెక్ష‌న్‌లో పెట్టింది.