Read more!

English | Telugu

హృతిక్ రోష‌న్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లు క‌న్ఫామ్ చేసిన స‌బా!

 

న‌టి, గాయ‌ని స‌బా అజాద్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లు అఫిషియ‌ల్‌గా వెల్ల‌డించింది. అత‌డిని 'మోన్ అమౌర్' అని సంబోధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ డ్రామా 'మినిమ‌మ్‌'ను అనౌన్స్ చేసింది. దీనికి హృతిక్ రియాక్ట్ అవ‌డం గ‌మ‌నార్హం.

త‌న పోస్ట్‌లో, "నా నెక్ట్స్ మూవీ 'మినిమ‌మ్‌'లో ఈ ర‌త్నాలు - న‌మితా దాస్‌, గీతాంజ‌లి కుల‌క‌ర్ణి, రుమ‌న మొల్ల‌తో క‌లిసి న‌టిస్తున్నాను. బెల్జియం బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే ఈ ఇమ్మిగ్రంట్ ఇండియ‌న్ డ్రామాను ప్ల‌టూన్ ఒన్ ఫిలిమ్స్‌, ఎల్ల‌నార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 2022లో సెట్స్ మీద‌కు వెళ్తున్న ఈ సినిమాకు శిలాదిత్య బోరా, రాధిక లావు నిర్మాత‌లు. ఈ ఇంట‌ర్నేష‌న‌ల్ డ్రామాతో రైట‌ర్‌-యాక్ట‌ర్ రుమ‌న మొల్ల డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతోంది." అని ఆమె రాసుకొచ్చింది.

దీనికి రెస్పాండ్ అయిన హృతిక్‌, కామెంట్ సెక్ష‌న్‌లో "Hehe. You gonna kill this! Oui? Oui!" అని రాశాడు. దీనికి  "hehe fingers crossed mon amour (My love)." అని రిప్లై ఇచ్చింది స‌బా.

కొద్ది నెల‌లుగా హృతిక్‌, స‌బా డేటింగ్‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 'దిల్ క‌బ‌డ్డీ' మూవీతో న‌టిగా ప‌రిచ‌య‌మైన స‌బా, 2011లో వ‌చ్చిన 'ముఝ్‌సే ఫ్రాండ్‌షిప్ క‌రోగే' సినిమాలో స‌ఖీబ్ స‌లీమ్‌తో క‌లిసి న‌టించింది. చివ‌ర‌గా 'ఫీల్స్ లైక్ ఇష్క్' అనే ఆంథాల‌జీ సిరీస్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది.