Read more!

English | Telugu

గాళ్‌ఫ్రెండ్‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసిన హృతిక్‌!

 

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు-నిర్మాత క‌ర‌ణ్ జోహార్ 50వ పుట్టిన‌రోజు వేడుక‌లో స్టార్ యాక్ట‌ర్ హృతిక్ రోష‌న్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. ముంబైలో బుధ‌వారం జ‌రిగిన క‌ర‌ణ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌కు త‌న గాళ్‌ఫ్రెండ్ స‌బా అజాద్‌తో క‌లిసి వ‌చ్చిన హృతిక్‌, త‌మ రిలేష‌న్‌షిప్‌ను అఫియ‌ల్‌గా అంద‌రికీ తెలియ‌జేశాడు. చేతిలో చేయి క‌లుపుకొని ఆ జంట అక్క‌డ‌కు వ‌చ్చింది. పార్టీ జ‌రుగుతున్న చోటుకి బ‌య‌ట ఆ ఇద్ద‌రూ కెమెరాల‌కు జంట‌గా పోజులిచ్చారు కూడా.

వైర‌ల్ అయిన ఓ వీడియోలో ఆ వేడుక‌కు హాజ‌రైన‌ అతిథుల‌కు స‌బా అజాద్‌ను హృతిక్‌ ప‌రిచ‌యం చేస్తుండ‌టం క‌నిపించింది. మ‌రో వీడియోలో ఆ ఇద్ద‌రూ కెమెరాల‌కు ప్రేమ ప‌క్షుల్లాగే స‌న్నిహితంగా పోజులివ్వ‌డం చూడొచ్చు. ఆ జంట బ్లాక్ క‌ల‌ర్ దుస్తుల‌తో పార్టీకి హాజ‌ర‌య్యింది. బ్లాక్ క‌టౌట్ డ్ర‌స్‌లో స‌బా మెరిసిపోగా, బ్లాక్ సూట్‌లో ముచ్చ‌ట‌గా క‌నిపించాడు హృతిక్‌. ఈ పార్టీకి హృతిక్ మాజీ భార్య సుజానే ఖాన్ కూడా హాజ‌ర‌య్యింది. ఆమె త‌న బాయ్‌ఫ్రెండ్ అర్‌స్లాన్ గోనీతో క‌లిసి వ‌చ్చింది.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఒక డిన్న‌ర్ డేట్  సంద‌ర్భంగా ఇద్ద‌రూ క‌లిసి క‌నిపించ‌డంతో హృతిక్‌, స‌బా రిలేష‌న్‌షిప్‌పై రూమ‌ర్స్ మొద‌ల‌య్యాయి. ఆ త‌ర్వాత ఒక గెట్‌-టుగెద‌ర్‌లో హృతిక్ కుటుంబంతో క‌లిసి క‌నిపించింది స‌బా. ఇప్ప‌టిదాకా వారు త‌మ రిలేష‌న్‌షిప్‌ను అధికారికంగా ధ్రువీక‌రించ‌లేదు, అలాగ‌ని ఖండించ‌నూ లేదు.