Read more!

English | Telugu

మూడు రోజుల్లోనే రూ. 56 కోట్లు వ‌సూలు చేసిన 'భూల్ భుల‌య్యా 2'

 

కార్తీక్ ఆర్య‌న్‌, కియారా అద్వానీ, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌లు పోషింయిన 'భూల్ భుల‌య్యా 2' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ‌స్ట్ వీకెండ్ అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బాలీవుడ్‌ను ఆనందంలో ముంచెత్తింది. తొలిరోజు శుక్ర‌వారం రూ. 14 కోట్ల‌ను రాబ‌ట్టిన ఈ సినిమా ఆ త‌ర్వాత రెండు రోజుల్లో మ‌రింత బాగా క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టింది. ఆదివారం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెల్లువెత్త‌డంతో మూడు రోజుల్లోనే ఈ సినిమాకు దాదాపు రూ. 56 కోట్లు వ‌చ్చాయి.

ఆదివారం ఈ సినిమా రూ. 23.51 కోట్ల‌ను వ‌సూలు చేసింది. దీంతో దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా వ‌సూళ్లు రూ. 55.96 కోట్ల‌కు చేరుకున్నాయి. ట్విట్ట‌ర్ ద్వారా బాక్సాఫీస్ లెక్క‌ల‌ను ట్రేడ్ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ పంచుకున్నాడు. "జ‌బ్బుతో కునారిల్లుతున్న ఇండ‌స్ట్రీ ఊపిరితిత్తుల‌కు 'భూల్ భుల‌య్యా 2' ఆక్సిజ‌న్ నింపింది. లైఫ్‌టైమ్‌లో ప‌లు హిందీ సినిమాలు రూ. 20 కోట్ల కంటే త‌క్కువ‌గా వ‌సూలు చేస్తున్న టైమ్‌లో ఫ‌స్ట్ వీకెండ్‌లోనే రూ. 55 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌డం అతిపెద్ద విజ‌యం. శుక్ర‌వారం రూ. 14.11 కోట్లు, శ‌నివారం రూ. 18.34 కోట్లు, ఆదివారం రూ. 23.51 కోట్లు. వెర‌సి రూ. 55.96 కోట్లు.. ఇండియా బిజినెస్" అని ఆయ‌న రాసుకొచ్చాడు.

ఈ సినిమా వీకెండ్ బిజినెస్‌ ఇప్ప‌టిదాకా కార్తీక్ ఆర్య‌న్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ వీకెండ్‌. అత‌ని మునుప‌టి బిగ్గెస్ట్ వీకెండ్ 2019లో వ‌చ్చిన 'ప‌తి ప‌త్ని ఔర్ వో' సినిమా వ‌సూలు చేసిన రూ. 35.94 కోట్లు. ఆ సినిమా కంటే ఇప్పుడు ఏకంగా రూ. 20 కోట్లు ఎక్కువ‌గా వ‌సూలు చేసింది 'భూల్ భుల‌య్యా 2'.