English | Telugu
నరేంద్రమోడీ గారిని కలవడం నిజంగా అదృష్టం...
Updated : Aug 24, 2022
పీవీ.సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. మొదట్లో ఎన్నో విమర్శలు తట్టుకుని అంచలంచెలుగా పైకి ఎదిగి ఈరోజున ఎంతో మంది పేరెంట్స్ కి, పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడింది. అలాంటి పీవీ.సింధుని ఆలీ తన షోకి తీసుకొచ్చి ఎన్నో విషయాలను చెప్పేలా చేశారు. "నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు నీ ఫీలింగ్ ఏమిటి ? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ? ఐస్ క్రీం కూడా తిన్నావు కదా ? అది ఏ ఫ్లేవర్ ? అంటూ ఆలీ సరదాగా కొన్ని, ఇంటరెస్టింగ్ గా కొన్ని ప్రశ్నలు అడిగేసరికి అన్ని ఫ్లేవర్స్ తెప్పించి నా ముందు పెట్టారు.. నీకు ఈ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తిను" అన్నారని చెప్పి నవ్వేసింది సింధు.
"నేను గెలిచినప్పుడల్లా మోడీ గారిని కలిసేదాన్ని , ఆయన చెప్పే ఇన్స్పైరింగ్ వర్డ్స్ వినేదాన్ని, నన్ను అభినందించినప్పుడు చాలా సంతోషించేదాన్ని. నేను ఒలింపిక్స్ లో గెలిచాక వెంటనే నాకు ఫోన్ చేసి నన్ను విష్ చేశారు. అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ . అలాగే "ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ " అంటూ నా గురించి ట్వీట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. "నిజంగా ఈ విషయాలన్నీ చాలా గర్వంగా అనిపిస్తాయి నాకు. అలాగే ఆట గెలిచి వచ్చాక నీతో ఐస్ క్రీం తింటా అని మోడీ గారు నాకు ప్రామిస్ చేశారు. నేను ఆ విషయం మర్చిపోయారనుకున్నా.. కానీ కాదు. ఆయన గుర్తుపెట్టుకుని మరీ ఐస్ క్రీం తెప్పించారు. అలాగే ఇంకో హ్యాపీ విషయం ఏంటంటే మోడీ @ 20 బుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అందులో నేను ఆయన గురించి ఒక చాప్టర్ రాయడం నిజంగా నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది..ఇట్స్ ఏ గ్రేట్ ఆనర్ " అంటూ చెప్పింది పీవీ.సింధు.