English | Telugu
డాన్స్ ఐకాన్ ఫస్ట్ లుక్ రిలీజ్..ఈ షోతో ఆహా ఓటిటిలోకి ఓంకార్ ఎంట్రీ
Updated : Aug 23, 2022
ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా' ఆడియన్స్ ని అలరించడానికి ఎప్పుడో ముందుంటుంది. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలను, రియాలిటీ టాక్ షోలను అందించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా సరికొత్త డాన్స్ షోతో ప్రేక్షకుల అలరించడానికి రాబోతోంది. ‘డాన్స్’ అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. ప్రతీ ఒక్కరూ ఒక డాన్సరే. ఐతే వాళ్ళల్లోంచి ఆణిముత్యాలని వెతికి, వారి ప్రతిభను ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి 'డాన్స్ ఐకాన్' షోతో త్వరలో వచేయడానికి సిద్దమయ్యింది. ఐతే ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.
ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో ఆహా ఓటీటీ ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించడమే కాదు మంచి సక్సెస్ ను కూడా అందుకుంది. ఇక ఇప్పుడు డాన్స్ కంటెస్టెంట్స్ తో రాబోతోంది. ఓంకార్ ఈ షోతో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ షోకి యాంకర్ గా, ప్రొడ్యూసర్ గా అన్ని తానె దగ్గరుండి చూసుకుంటున్నాడు. లేటెస్ట్ గా ఈ షో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గా ‘ఆహా’ విడుదల చేసింది. స్టైలిష్ స్టేజి తో పాటు బుల్లితెర స్టైలిష్ యాంకర్ ఐకాన్ ఐన ఓంకార్ అద్దిరిపోయే లుక్ లో కనిపించారు. ఏ ఏజ్, ఏ స్టైల్ , నో లిమిట్ త్వరలో మన ఆహాలో అంటూ చెప్పాడు ఓంకార్.