English | Telugu
ఇంతకు నా సౌందర్య లహరి ఎక్కడ అంటున్న ఆది
Updated : Aug 23, 2022
డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా హైపర్ ఆదిని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి తన మీద తానె పంచులు వేసుకుని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. లేటెస్ట్ గా ప్రసారం ఐన శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో ఆది ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు. సౌందర్య లహరి అంటూ బొడ్డు మీద పుట్టుమచ్చ అంటూ ఇలా ఓ కాన్సెప్ట్‌తో ఈ సారి ఎంటర్టైన్ చేశారు. అయితే ఇందులో భాగంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ లేడీస్ అందరినీ ఒకే సారి పిలిపించారు. అందులో తనకు కావాల్సిన సౌందర్య లహరి ఎక్కడుంది ? ఆ నడుము మీద మచ్చ ఎక్కడుందా? అని వెతుకుంటాడు ఆది.
పవన్ కళ్యాణ్ లా ఆది చేస్తాడు. ముందు మలక్ పేట్ శైలజ ముందుకు వస్తుంది. నాకు మచ్చ ఉందేమో చూడు అని అంటుంది. నిన్నూ, నీ పుట్టు మచ్చను నేను చూడను అంటూ పరువుతీస్తాడు. వీళ్లను ఎందుకు పెట్టారంటూ ఆది కౌంటర్లు వేస్తాడు. మొత్తానికి నటకుమారి, శైలజ ఆదికి చుక్కలు చూపిస్తారు. తర్వాత భాస్కర్, నరేష్, శీరిష కూడా వచ్చి నడుము పుట్టు మచ్చ చూసుకోండి అంటూ చెప్తారు. ఇక ఇందులో వకీల్ సాబ్ మూవీలో నటించిన సూపర్ వుమెన్ బ్యూటీ కూడా వచ్చి ఎంటర్టైన్ చేసింది. నరేష్ వచ్చి కొత్తిమీర, కర్రెపాకే అంటూ కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. ఇలా ఈ వారం స్కిట్ ముగిసింది.