English | Telugu

కౌశల్ మందా ఆర్మీ ఎటాక్‌తో ఫుల్లుగా తాగేశాను!

'ఐస్ క్రీమ్‌' మూవీ హీరోయిన్ తేజస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ చేసి పేరు తెచ్చుకుంది. చేసేది చిన్న రోల్ ఐనా స్పెషల్ ఫోకస్ అంత తేజస్వి మీదే ఉంటుంది ఆడియన్స్ కి. లేటెస్ట్ గా"కమిట్‌మెంట్‌" అనే మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ లో తనకు ఎదురైన ఎక్స్పీరిఎన్సెస్ ని షేర్ చేసుకుంది.

"బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి బయటికి వచ్చాక చాలా నెగటివిటీని ఫేస్ చేయాల్సి వస్తుందని అనుకున్నారా?" అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు, ‘‘ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అయితే నాకు దిమ్మతిరిగిపోయింది. సినిమాలన్నీ ఒక ఎత్తైతే .. బిగ్‌బాస్‌, కౌశల్‌ మందా ఆర్మీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎటాక్ అని నేను ఫీలయ్యాను. చెప్పాలంటే నేనొక అమ్మాయిని, నా దగ్గర ఏముందని నన్ను అంతలా అటాక్‌ చేస్తున్నారు. మీమ్స్‌ చేసి, డర్టీ థింగ్స్ చేశారు. ఐతే దాని వల్ల ఉపయోగం ఎవరికీ లేదు. వాడొకడు లైఫ్‌లో ముందుకెళ్లడానికి ఇవన్నీ చేయించాడు కానీ చూడండి.. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా.. ఇలా కౌశల్ మందా ఎటాక్ తర్వాత నేను చాలా డిప్రెస్‌ అయ్యాను. సినిమాలు చేయకూడదనుకున్నా. రెండున్నర ఏళ్ళు ఇండియాలో లేకుండా.. బయటి దేశాల్లో ఒంటరిగా తిరిగాను. మెంటల్ గా చాలా స్ట్రెస్ అయ్యా.. బిగ్ బాస్ హౌస్ నుంచి హ్యాపీగా బయటికి వచ్చేసరికి నా ఫ్రెండ్స్‌ అందరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు. ఏంటా అని చూస్తే.. మీమ్స్‌, బూతులు.. ఇంటి పేరు మురికివాడ అంటూ ఇష్టమొచ్చినట్లు చేసేసారు అని బాధపడ్డారు. ఇవన్నీ చూసేసరికి నాకు చాలా బాధేసింది" అని చెప్పింది తేజస్వి.

"అలా డిప్రెస్డ్ గా ఉన్న టైంలో ఈ మూవీ ఆఫర్ వచ్చింది.ఈ మూవీతో రీఎంట్రీలా మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చాను" అని తెలిపింది తేజస్వి. "ఐతే అప్పటికి నేను ఫుల్లుగా తాగేసి సరైన స్థితిలో లేను. కానీ తర్వాత నాకు నేను ధైర్యం చెప్పుకున్నా. ఎవడో ఏదో అంటే నేనెందుకు భయపడాలి" అంటూ తనకు జరిగిన ఇన్సిడెంట్స్ ని చెప్పుకొచ్చింది తేజస్వి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.