English | Telugu
అనసూయను మర్చిపోని దొరబాబు..
Updated : Aug 24, 2022
జబర్దస్త్ షో అంటే అప్పటికీ, ఎప్పటికీ గుర్తుండేది అనసూయ, రష్మీ, నాగబాబు, రోజా, సుధీర్. వారిని వీక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇక జబర్దస్త్ కమెడియన్స్ కూడా అక్కడ యాంకర్స్ మారినా పొరపాటున వెళ్లిపోయిన వాళ్ళను గుర్తుచేసుకుని నాలుక కరుచుకుంటూ ఉంటారు. అలాంటిదే ఒకటి జబర్దస్త్ ఎపిసోడ్ లో జరిగింది. ఆది టీంలో కమెడియన్ గా చేసేదొరబాబుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తుంటాడు. రాబోయే ఎపిసోడ్ లో దొరబాబు తప్పులో కాలేశాడు. స్కిట్ లోకి వచ్చి రాగానే ఇంకా అనసూయ యాంకర్ గానే ఉన్నది అనుకున్నట్లుంది దొరబాబు.
ఒక పక్క పరదేశి, రష్మీ స్టెప్పులేస్తుంటే దొరబాబు చూస్తూ ఉండిపోయాడు. పరదేశి "నువ్వేంట్రా అలా చూస్తున్నావ్?" అన్నాడు. "అనసూయ స్టెప్పులు" అంటూ గబుక్కున అనేసి, నాలుక కరుచుకొని, "ఛీఛీ.. రష్మీ" అంటూ కవర్ చేసుకోవడానికి తెగ ట్రై చేశాడు. కానీ రష్మీ "ఓయ్" అంటూ వెనకబడి మరీ పరిగెత్తి కొట్టింది. గ్లామరస్ క్వీన్ అనసూయని అంత తొందరగా ఎవరూ మర్చిపోవడం సాధ్యం కాదు. ఇప్పుడు దొరబాబు అనసూయ పేరు చెప్పేసరికి రష్మీ బాగానే హర్ట్ ఐనట్టు కనిపిస్తోంది. దొరబాబు, పరదేశీ ఈ ఇద్దరూ ఆది టీంలో తప్ప ఇంకెక్కడా కనిపించరు. ఐతే కొద్దీ రోజులుగా ఆది జబర్దస్త్ షోలో కనిపించక పోయేసరికి ఈ టీం కూడా ఎక్కడా కనిపించట్లేదు. మళ్లీ ఇప్పుడు దొరబాబు, పరదేశీ కనిపిస్తున్నారు.