English | Telugu

'నాది మొత్తం కత్తిరించేస్తారు' అంటున్న భగవాన్!

జబర్దస్త్ ప్రతీ వారం తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షో ద్వారా పేరు సంపాదించుకున్న ఎంతో మంది సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ లుగా మారిపోయారు. ఇలాంటి జబర్దస్త్ నుంచి ఎంతో మంది వెళ్లిపోయారు. జడ్జెస్ నాగబాబు, రోజా వెళ్లిపోయిన దగ్గర నుంచి ఎంతో మంది మారుతున్నారు. వారానికి ఒకరు, రెండు వారాలకు ఒకరు అన్నట్టుగా కొత్త కొత్త వాళ్ళను తెస్తున్నారు. జడ్జెస్ ప్లేస్ లో వచ్చే వారం ఎవరు అనేది మాత్రం జబర్దస్త్ ఆడియన్స్ కి పెద్ద పజిల్ అని చెప్పొచ్చు. కొన్ని వారాలు మనో, ఇంద్రజ, ఆమనివంటి వారు జడ్జిలుగా వచ్చారు.

ఇక ఇప్పుడు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ కమెడియన్ కృష్ణభగవాన్ ను జడ్జిగా తీసుకొచ్చింది మల్లెమాల టీం. ఇంద్రజ మాత్రం ఈ షోకి పెర్మనెంట్ జడ్జిగా ఫిక్స్ ఐపోయింది. ఇకపోతే ఈ షోకి కృష్ణ భగవాన్ ఎంట్రీ అయితే అందరికీ షాకిచ్చింది. ఐతే ఈ ఎపిసోడ్ ప్రోమో చూస్తే గనక కంటెస్టెంట్లను మించి భగవాన్ పంచులు వేసినట్టు కనిపిస్తోంది. ఇందులో వెంకీ మంకీస్ టీమ్ 'శివపుత్రుడు' మూవీలో ఒక సీన్ స్పూఫ్ కామెడీ చేశారు. ఈ స్కిట్ అయ్యాక ఇంద్రజ ఆ టీంని చాలా ఎక్కువగా పొగిడేసరికి "ఆవిడ స్కిట్ కంటే ఎక్కువగా చెప్పారు" అంటాడు భగవాన్.

"ఇంత ఇస్తే గాని అందులో ఏది బాగుందో చూసుకుని కట్ చేసి వేసుకునే వీలుండదు. ఎడిటర్స్ కి అందుకే ఇంత ఎక్స్ప్రెషన్ ఇస్తాను" అన్నట్టుగా చెప్తుంది ఇంద్రజ.. ఇక ఆమె మాటకు "ఐతే నాది మొత్తం కట్ చేస్తారు" అంటూ కౌంటర్ వేస్తాడు. ఇక ఈ వారం కృష్ణ భగవాన్ కామెడీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనుంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..