English | Telugu
బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన 'బబ్లీ బౌన్సర్'!
Updated : Sep 19, 2022
బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ ఆదివారం ఎవరో ఒకరు సెలబ్రిటీ రావడం తెలిసిన విషయమే. అయితే ఈ వారం సెలబ్రిటీగా నటి 'తమన్నా' బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది.
"బబ్లీ బౌన్సర్ మూవీతో త్వరలో మీ ముందుకు వస్తున్నా" అని చెప్పింది తమన్నా. తర్వాత నాగార్జున కాసేపు తను నటించిన సినిమా గురించి చెప్పమన్నాడు. "క్లాస్ గా, మాస్ గా నటించడం సులభమే కానీ అమాయకంగా నటించడం చాలా కష్టం. ఈ మూవీలో నేను అమాయకంగానూ, మాస్ రోల్ 'బౌన్సర్' గాను చేసాను" అని తమన్నా నాగార్జునతో చెప్పింది. తర్వాత 'ఈ వారం తమన్నా కానుకగా ప్రకటిస్తున్నాను' అని నాగార్జున కంటెస్టెంట్స్ తో చెప్పాడు. తర్వాత హౌస్ లోకి అడుగుపెట్టింది. కంటెస్టెంట్స్ అందరూ తమన్నాను చూడగానే 'ఓ' అంటూ అరుస్తూ కేకలు వేసారు. "ఎవరైతే తమన్నాను ఇంప్రెస్ చేస్తారో వారికే ఈ వారం బహుమతి" అని నాగార్జున కంటెస్టెంట్స్ తో చెప్పాడు. రేవంత్, అర్జున్, సూర్య, రోహిత్ తమ మాటలతో ఇంప్రెస్ చేద్దామని ప్రయత్నించారు. సూర్య 'విజయదేవరకొండ' వాయిస్ ని, 'అల్లు అర్జున్' వాయిస్ ని, మిమిక్రీ చేసి తమన్నాను ఇంప్రెస్ చేసాడు. సూర్య టాస్క్ లో గెలిచి తమన్నా కానుకను గెలుచుకున్నాడు.
టైం ఐపోయిందని బిగ్ బాస్ హౌస్ నుండి తమన్నా ను బయటకు వచ్చేయమన్నాడు నాగార్జున. అలా కాసేపు బబ్లీ బౌన్సర్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది.