English | Telugu

స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్..ఊరడించిన ఓంకార్

శేఖర్ మాస్టర్ టాలెంటెడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. టాలీవుడ్ లోని టాప్ హీరోస్ అందరికీ  కొరియోగ్రఫి చేశారు.ఇప్పుడు ఆయన ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న డాన్స్ ఐకాన్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.  ఏ షో ఐనా సరదాగా నవ్వుతూ కనిపించే శేఖర్ మాస్టర్ రీసెంట్ గా రిలీజ్ ఐన డ్యాన్స్ ఐకాన్ షో ప్రోమోలో కన్నీరుపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాన్స్ ఐకాన్ షోలో కంటెస్టెంట్ అసిఫ్  చేసిన "ఆశా పాశం" అనే సాంగ్ కి చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్  చూసి స్టేజి మీద ఉన్న అందరూ  ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న జడ్జెస్ కూడా కన్నీరు పెట్టుకున్నారు...