English | Telugu
నైనిక కోసం సాయి ఆ డైలాగ్ కావాలనే చెప్పాడా?
Updated : Sep 18, 2022
ఈ మధ్య షోస్ లో ఎక్కువగా ప్రేమ సీన్లు కనిపిస్తున్నాయి. వాళ్ళ వాళ్ళ పార్టనర్స్ కి ఏమన్నా చెప్పాలి అంటే స్కిట్ రూపంలో కానీ డైలాగ్స్ రూపంలో కానీ, డాన్స్ రూపంలో కానీ చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు చాలా షోస్ లో ఇలాగే జరుగుతోంది. ఇది నిజామా కాదా అనే భ్రమలో ఆడియన్స్ ని ఉంచేసి వాళ్ళ వాళ్ళకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఢీ షోలో కూడా అదే జరిగింది. ఈ షోలో రొమాంటిక్ జోడి పెయిర్ గా నైనిక, సాయిని చెప్పుకుంటారు. వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో ఎక్కువగా ముద్దులు, హగ్గులు ఉంటాయి.
ఐతే కొంత కాలంగా వీళ్ళు కలిసి డాన్స్ చెయ్యట్లేదు. దాంతో వీళ్ళిద్దరూ విడిపోయారని వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు రాబోయే ఎపిసోడ్ లో ఇద్దరూ కలిసి డాన్స్ చేసేసరికి అందరూ కూడా మళ్ళీ వీళ్ళు కలిసిపోయారని అనుకుంటున్నారు. ఇక ఈ డాన్స్ అయ్యాక సాయి ఒక డైలాగ్ చెప్పాడు. "అమ్మాయిల మైండ్ లో మనం లేకపోతే గుర్తు చేస్తాం, అదే హార్ట్ లో లేరని చెప్తే తట్టుకోలేం కదా" అనే డైలాగ్ ని నైనికా కోసం ఒక నాలుగైదు సార్లు చెప్పించాడు ఆది. దీన్ని బట్టి నైనికాకు సాయి అంటే ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ ఇద్దరి మధ్య ప్రేమ పొంగేలా చేయడానికే ఈ డైలాగ్ ని ఇన్ని సార్లు చెప్పించారని అర్ధమవుతోంది. మరి నైనికా ఈ డైలాగ్ కి ఎలా రియాక్ట్ అయ్యింది. సాయి ప్రేమను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా? ఇద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురిస్తుందా? అసలు ఇద్దరి మధ్య ఎం జరిగిందో తెలియాలంటే 21 న ప్రసారం కాబోయే ఢీ షో చూడాల్సిందే.