English | Telugu

ఇంత అడల్ట్ కంటెంట్..డైలాగ్స్ అవసరమా!

బుల్లి తెర ఈ మధ్యన పరిశీలిస్తే అడల్ట్ కంటెంట్ బాగా పెరిగిపోయింది. ఆ డైలాగ్స్ కూడా మరీ అధ్వాన్నంగా ఉంటున్నాయి. వాటికి సెన్సార్ మాత్రం ఉండడంలేదు. ఆదివారం మధ్యాహ్నం వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో కొంత ఫన్ , ఎంటర్టైన్మెంట్ అనేది అందిస్తోంది. ఐతే ఈ మధ్యన కాస్త పట్టు తప్పుతోందనే విషయాన్ని రీసెంట్ ఎపిసోడ్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. పెద్దలు పిల్లలు కలిసి కూర్చుని చూసే ప్రోగ్రాం ఇది. కానీ ఆ ఎపిసోడ్ ని కూడా ఇప్పుడు బ్రష్టు పట్టించే పనిలో ఉన్నారు కొంత మంది కమెడియన్స్. ఇక ఇటీవల ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్ చూస్తే గనక జోడి నెంబర్. 1 పేరుతో ఈ ఎపిసోడ్ మొదలయ్యింది.

ఐతే ఇందులో రీల్ జోడీస్ తో, రియల్ జోడీస్ తో కలిసి మ్యూజికల్ జోడి చైర్ గేమ్ ఆడించారు. ఐతే ఇందులో మగవాళ్ళు తమ లేడీ జోడీస్ ని రెండు చేతులతో ఎత్తుకుని తిరుగుతూ మ్యూజిక్ ఆగగానే కుర్చీలో కూర్చోవాలి. ఇదంతా ఒక ఎత్తు ఇక చెప్పిన డైలాగ్స్ అన్నీ మరో ఎత్తు. అన్నీ కూడా డబుల్ మీనింగ్ తో నిండినవే. ఇలా అమ్మాయిలను ఎత్తుకుని తిరుగుతూ గేమ్ ఆడుతూ సమాజానికి వీళ్ళు ఇస్తున్న సందేశం ఏమిటి..? ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ గురించి ప్రజల్లో నెగటివిటీ వచ్చింది. అది హౌస్ లో జరిగే ఈవెంట్ ఐతే ఇది ప్రతీ వారం జరిగే ఈవెంట్.

ఇలాంటి స్కిట్స్ తో , ఇలాంటి గేమ్స్ తో పిల్లల్ని పెద్దవాళ్ళను ఎలా ఎంటర్టైన్ చేస్తారు ? అందులోనూ ఈ షోలో ఈ పర్టిక్యూలర్ గా గేమ్ లో ఆది డైలాగ్స్ వింటే " ఇలాంటి గేమ్ షో ప్రతీ ఎపిసోడ్ లో పెట్టాలి" అనడం ఎంత వరకు సమంజసం. ఆదితో జోడీగా చేసిన అమ్మాయిని ఆటో రాంప్రసాద్ అడిగాడట కానీ ఆ అమ్మాయిని ఆదికి జోడీగా పెట్టారు. ఏం చేసాడో అంటూ రాంప్రసాద్ డైలాగ్ వింటే అమ్మాయిలపై వాళ్లకు ఉన్న గౌరవం ఏపాటిదో అర్ధమవుతుంది. "అరే నరేష్ పవిత్ర విషయంలో అంత కక్కుర్తి ఎందుకు" అంటూ ఆది వేసిన మరో డైలాగ్ వింటే ఎవరైనా ఛి అనకుండా ఉండరు. ఇలాంటి కంటెంట్ తో, ఇలాంటి డైలాగ్స్ తో ఎన్ని రోజులు ఈ షోని నడిపిస్తారు. సెన్సార్ ఉండదు కదా అని ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడితే ఆడియన్స్ కూడా తగిన బుద్దే చెప్తారు.