English | Telugu

జడ్జెస్ అంటే ఎగతాళిగా ఉందా?.. కార్తీక్‌పై ఇంద్ర‌జ ఫైర్‌!

జబర్దస్త్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తోంది. కానీ అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీలు కూడా మూట గట్టుకుంటోంది ఈ షో. టీమ్ లీడర్స్ జడ్జెస్ గా, జడ్జెస్ టీమ్ లీడర్స్ గా రోల్స్ చేంజ్ చేసుకుని స్కిట్ చేస్తే ఎలా ఉంటుంది? అనే విషయం పై ఈ వారం కెవ్వు కార్తిక్ తన టీమ్ తో ఒక స్కిట్ వేసాడు. ఐతే ఈ స్కిట్ లో కార్తీక్ నటన జడ్జి ఇంద్రజకు పిచ్చ కోపం తెప్పించేసింది. "జడ్జిమెంట్ కూడా ఇవ్వను" అంటూ సీరియస్ గా చెప్పేసారు ఇంద్రజ.

నాటీ నరేష్ జడ్జి ఖుష్భు వేషంతో, ఇంకో చిన్నారి లేడీ కంటెస్టెంట్ జడ్జి ఇంద్రజ వేషం వేసింది. వీళ్ళిద్దరూ టీమ్ లీడర్స్ గా, కెవ్వు కార్తీక్ జడ్జిగా ఈ స్కిట్ లో పెర్ఫార్మ్ చేస్తారు. ఐతే జడ్జెస్ చెప్పేది స్క్రిప్టెడ్ జడ్జిమెంట్ అని కార్తీక్ కొంచెం కాంట్రవర్సీగా మాట్లాడేసరికి జడ్జెస్ కి కోపం వచ్చేసింది. స్కిట్ అయ్యాక‌ "మేము జడ్జెస్ పొజిషన్ లో కూర్చుని చేసేదంతా మీకు కామెడీగా అనిపిస్తోందా.. డిస్క్లైమర్ పెడితే ఏది కావాలంటే అది చేయొచ్చు కదా" అంటూ కార్తీక్ ని ఖుష్భూ అడిగేసరికి కార్తిక్ షాక్ ఐపోతాడు. కానీ కాసేపటికి అది జోక్ అని చెప్పేసరికి కార్తిక్ హ్యాపీగా ఉంటాడు.

"ఇప్పటివరకు అన్ని మంచి స్కిట్స్ వేశారు.. రానురాను ఇలా తయారైతే ఎలా.. హ్యాపీగా జడ్జెస్ సీట్ లో కూర్చుని జడ్జిమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారని మీరు మనసులో అనుకుంటున్నారు కదా" అని ఇంద్రజ అడిగేసరికి, "అలా కాదు మేడం" అంటూ క‌న్విన్స్ చేయ‌బోయాడు కార్తీక్‌. "టీం లీడర్స్ గా మీరు పడే కష్టాలు చెప్పారు.. ఇప్పుడు జడ్జెస్ గా మేము పడే కష్టాలను కూడా ఒక స్కిట్ గా వేసి చూపించాలి.. ఆ స్కిట్ వేశాకే ఈ షోలో మీ పెర్ఫార్మెన్స్ కి జడ్జిమెంట్ అప్పుడు చెప్తా" అంటూ ఫుల్ ఫైర్ అయ్యారు ఇంద్రజ. ఇలా ఈ వారం ఎపిసోడ్ కొంచెం హాట్ హాట్ గా పూర్తయ్యింది.