English | Telugu
నారాయణ గారు ఏ తప్పూ చేయలేదా.. అందరూ పత్తిత్తులేనా?
Updated : Sep 18, 2022
టాలీవుడ్ ఇండస్ట్రీలో శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ఒకటి రెండు కాదు.. 35 ఏళ్ళుగా ఇండస్ట్రీలో నటుడిగా, కారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా దాదాపు 400 సినిమాల్లో నటించాడు శివాజీ రాజా. తర్వాత మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పని చేసాడు. రెండేళ్ల క్రితం గుండెపోటు వచ్చేసరికి ఆయన అసలు బయటకు రావడమే మానేసాడు. ఐతే ఇటీవల ఆయన యూట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ షో గురించి నారాయణ కామెంట్స్ గురించి కొన్ని హీట్ పుట్టించే మాటలు మాట్లాడారు.
"నారాయణ అంటే చాలా గొప్ప వ్యక్తి అనుకున్నా. కానీ ఉదయం నోరు జారడం సాయంత్రమయ్యేసరికి సారీ చెప్పడం. ఎందుకు ఇదంతా? నారాయణ గారి లాంటి వాళ్ళు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఐతే ఇండస్ట్రీలో అలాంటి కామెంట్స్ ని తిప్పి కొట్టే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. బిగ్ బాస్ అంటే మాటలు కాదు. వాళ్ళు ఎంతో మందిని ఫిల్టర్ చేస్తారు. ఎవరు ఎలా కష్టపడ్డారు, జీవితంలో ఎలా పైకి వచ్చారు అనే విషయాలేమి చూడకుండా వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోరు. అలా కష్టపడి పైకొచ్చి అలాంటి ప్లాట్ ఫారం పై కంటెస్టెంట్స్ నిలబడ్డారు అంటే అది చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళను నారాయణ గారు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడ్డం సరికాదు. అందరూ పత్తిత్తులుగానే ఉంటారా? నారాయణ గారు ఏ తప్పు చేయలేదా? నేను ఏఐఎస్ ఎఫ్ నుంచి వచ్చాను. నాకూ అభ్యుదయ భావాలూ ఉన్నాయ్. కానీ నారాయణ గారికి నోటి దూల చాలా ఎక్కువ. అసలు ఈయనకు నాగార్జున మీద కోపమా, బిగ్ బాస్ మీద కోపమో తెలీదు. సిపిఐ పార్టీలో పెద్ద పదవిలో ఉన్న నారాయణ గారు ముందు బిగ్ బాస్ షో చూడడమే తప్పు. అసలు పార్టీ కార్యక్రమాలను పట్టించుకోకుండా బిగ్ బాస్ చూస్తున్నాడని కదా అర్ధం ..ఇంకో విషయం ఏమిటి అంటే పార్టీలో ఈయన్ని పక్కన బెట్టారు. ఏం చేయాలో అర్ధం కాక ఇలాంటి చెత్త కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి నోటి దూల వాళ్ళు ఉంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేస్తుంది" అంటూ యాక్టర్ శివాజీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు.