English | Telugu

తీరు మార్చుకోని ఆది.. హరితేజ మాములుగా చేయలేదుగా!

దసరా పండగ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ దసరా సందర్భంగా బుల్లి తెర కూడా జోష్ ఫుల్, కలర్ ఫుల్ ప్రోగ్రామ్స్ తో రెడీ ఐపోతోంది. ఇప్పుడు ఈటీవీలో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దసరా ఈవెంట్ ఒకటి రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. "మా హైదరాబాద్ లో దసరా ఉత్సవాలు బాగా జరుగుతాయి అంటే మా విజయవాడలో బాగా జరుగుతాయి" అంటూ చిన్న ఫైట్ తో ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ఈవెంట్ కి సంఘవి, ప్రేమ గెస్టులుగా వస్తారు. ఈ షోలో ఆది, సిరి హన్మంత్, రచ్చ రవి, యాంకర్ రవి, హరితేజ, పవిత్ర, సాయికిరణ్, నాటి నరేష్, జ్యోతక్క, భానుశ్రీ ఇంకా కొంతమంది బుల్లి తెర స్టార్స్ పార్టిసిపేట్ చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు.

స్కిట్ లో సిరికి ఫాదర్ గా ఆది చేసాడు. "నాన్న ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది" అనేసరికి "రెండు రోజులకే బోర్ కొడితే బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులు ఉన్నప్పుడు ఎంత బోర్ కొట్టాలో చెప్పు" అంటాడు. "ఎందుకు నేను ఫన్ ఇచ్చాను కదా" అంటుంది సిరి. "ఫన్ అంతా షన్నుకే ఇచ్చావ్ కదా" అంటాడు ఆది. ఆది ఫాదర్ రోల్ లో ఉన్నప్పుడు ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడడం వలన ఆ స్కిట్ లో నెగటివిటీ వస్తుంది. ఆది స్కిట్స్ లో మహిళలను కించపరిచేలా డైలాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయని మహిళలు కూడా ఫైర్ అవుతున్నారు. కానీ ఆది తీరు మారడం లేదు.

ఇక యాంకర్ రవి "గుమ్మాడి గుమ్మాడి" అనే సాంగ్ పాడి అందరిని మెస్మోరైజ్ చేసాడు. ఇక రచ్చ రవి "తాను హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మలా అక్కున చేర్చుకుంది జబర్దస్త్ " అని ఎమోషన్ అవుతూ ఆ స్టేజిని ముద్దు పెట్టుకుంటాడు. హరితేజ సావిత్రిలా నటించి మెప్పించింది. అచ్చంగా సావిత్రినే దివి నుంచి భువికి దిగి వచ్చిందా అన్నట్టుగా మహానటి మూవీలో సాంగ్ కి చేసిన అభినయం ఈ టోటల్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచింది. "చనిపోయిన వాళ్ళను గుర్తు చేయడం వేరు. డైరెక్ట్ గా వాళ్ళే వచ్చినట్టు చేయడం వేరు. హరితేజ అంత అద్భుతంగా చేసింది" అంటూ హైపర్ ఆది సూపర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. "నీ నటన చూసేసరికి నాకు మాటలు రాలేదు ఏడుపొచ్చేసింది" అంటూ సంఘవి చెప్పేసరికి హరితేజ ఫుల్ ఖుష్ అయ్యింది. ఇక హరితేజ పెర్ఫార్మెన్స్ కి స్టేజి మొత్తం నిలబడి ఈలలు, కేకలు వేశారు. ఇక ఈ ఈవెంట్ లో ఇంకా ఎలాంటి పంచులు ఉన్నాయి, ఎలాంటి పెర్ఫార్మెన్సులు ఉన్నాయో తెలియాలంటే 25వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.