'అడవి సింహాలు' షూటింగ్లో దుర్ఘటన.. సిలిండర్ పేలి ఒకరి తల తెగింది!
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై చలసాని అశ్వినీదత్ నిర్మించిన హిట్ ఫిల్మ్ 'అడవి సింహాలు' (1983). కృష్ణ-శ్రీదేవి, కృష్ణంరాజు-జయప్రద రెండు జంటలుగా నటించిన ఈ సినిమాకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. క్షేమమా ప్రియతమా, హేయ్ హేయ్ గంటకొట్టిందా, అగ్గిపుల్ల భగ్గుమంటది, పిల్ల నచ్చింది, గూటిలోకి చేరేది ఎప్పుడు.. పాటలు బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఈ సినిమా షూటింగ్ వైజాగ్ బీచ్‌లో జరిగినప్పుడు ఓ దుర్ఘటన జరిగింది.