Read more!

English | Telugu

అంజ‌లికి సీత పాత్ర తెచ్చిన తంటా!

 

వెంక‌టేశ్‌, మ‌హేశ్ అన్న‌ద‌మ్ములుగా న‌టించిన 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఆ సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న నాయిక‌గా స‌మంత న‌టిస్తే, వెంక‌టేశ్ జోడీగా అంజ‌లి క‌నిపించింది. నిజానికి టైటిల్‌లోని సీత పాత్రధారిణి ఆమే. అందులో ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయిగా సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన చీర‌క‌ట్టులోనే సినిమా అంతా క‌నిపిస్తుంది అంజ‌లి. ఆ పాత్ర ఆమెకు చాలా పెద్ద పేరు తెచ్చింది. 'ఎంత చ‌క్క‌గా, ఒద్దిక‌గా ఉంది ఈ అమ్మాయి!' అని అంద‌రూ ముచ్చ‌ట‌ప‌డిపోయారు. 

ఆ త‌ర్వాత ఆమె కొన్ని సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌లో కుర‌చ దుస్తుల్లో వేసిన డాన్సులు చేసి ఆశ్చ‌ర్య‌పోయిన వారెంద‌రో! ఆ సినిమా అంత ముచ్చ‌ట‌గా క‌నిపించిన ఆ అమ్మాయి ఇలాంటి డ్ర‌స్సుల్లో, ఇలాంటి పాట‌ల్లో చేసిందేమిటి అన్న‌వాళ్లున్నారు. ఇమేజ్ అనేది ఎలాంటి ఇబ్బంది తెస్తుందో అంజ‌లి కూడా స్వ‌యంగా ఎక్స్‌పీరియెన్స్ చేసింది.

'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' సినిమా చేసిన త‌ర్వాత ఆమె ఒక‌సారి ఫిజియో థెర‌పీ కోస‌మ‌ని వెళ్లింది. అప్పుడు అంజ‌లి డెనిమ్‌, జీన్స్‌లో ఉంది. అక్క‌డ‌ ఆమెను చూసిన ఓ న‌ర్సు చిరాకుప‌డుతున్న‌ట్లుగా బిహేవ్ చేసింది. "ఏమిట‌మ్మా నామీద కోపం చూపిస్తున్నావు?" అన‌డిగింది అంజ‌లి. 

"మా అత్త‌య్య‌గారు మిమ్మ‌ల్ని 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' సినిమాలో చూసి ఏమ‌న్నారో తెలుసా? 'చ‌క్క‌గా ఆ అమ్మాయి ఇంత పొడ‌వు జ‌డ‌, పువ్వులు, చీర క‌ట్టుకొని ఎంత బాగుందో చూడు.' అని. ఆమెను తీసుకొచ్చి మిమ్మ‌ల్ని చూపిద్దామ‌నుకున్నాను." అని చెప్పింది ఆ న‌ర్సు. 

ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో పంచుకుంది అంజ‌లి. అయితే అలా త‌న పాత్ర‌కు క‌నెక్ట‌యి, దాన్ని సొంతం చేసుకోవ‌డ‌మ‌నేది ఆశీస్సుల లాంటివేన‌ని ఆమె చెప్పింది.