Read more!

English | Telugu

హైద‌రాబాద్‌లో సినిమాహాలు క‌ట్టాల‌నుకున్న శోభ‌న్‌బాబు!

 

తెలుగువారి అభిమాన న‌టుల్లో శోభ‌న్‌బాబు ఒక‌రు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌ర్వాత ఫ్యామిలీ హీరోగా అంత‌టి పేరు సంపాదించిన న‌టుడు ఆయ‌న‌. అక్కినేని హైద‌రాబాద్‌లో అన్న‌పూర్ణ స్టూడియోస్ క‌ట్టి, తెలుగు చిత్ర‌సీమ ఇక్క‌డ‌కు త‌ర‌లిరావ‌డానికి అవిర‌ళ కృషి చేశారు. స్టూడియో లాంటి ఆలోచ‌న లేక‌పోయినా, హైద‌రాబాద్‌లో సినిమా థియేటర్ కట్టాలని శోభన్‌బాబు అభిలషించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. చిత్రసీమ అంతా హైదరాబాద్ తరలివచ్చినా ఆయన మాత్రం చెన్నైని విడిచిపెట్టలేదు. చివరివరకు అక్కడే గడిపారు. అగ్ర క‌థానాయ‌కుల్లో హైద‌రాబాద్‌కు రాని వ్య‌క్తి ఆయ‌నే.

1975 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో తగిన స్థలాన్ని నిర్ణయించి ఆధునిక వసతులతో ఒక చక్కని థియేటర్‌ను నిర్మించదలచినట్లు ప్రకటించారు. కానీ తర్వాత ఎందుకనో ఆయన ఆ పనిని విరమించుకున్నారు. 'హలో గురూస (1996) సినిమా తర్వాత సినిమాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. తన కుమారుణ్ణి సైతం సినిమా రంగానికి దూరంగా ఉంచారు. 

శోభ‌న్‌బాబు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును చెన్నైలోని పలు ప్రాంతాల్లో స్థలాలు, భవనాలపై వెచ్చించారు. మరింత డబ్బు గడించారు. ఆయన చూపిన బాటలోనే మరో నటుడు మురళీమోహన్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగంలో రాణించారు.