English | Telugu
మురారి ప్రేమను కృష్ణ తెలుసుకోగలదా!
Updated : Jun 28, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-194లో.. కృష్ణ, మురారి ఇద్దరు కలిసి కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటారు. అయితే ఉల్లిపాయలను తరిగి ఒక ప్లేట్ లో వాటిని లవ్ షేప్ లో సెట్ చేసి, కృష్ణకి తెలియాలని ఇస్తాడు. కానీ తను చూడకుండా ఒక టవల్ ని ఆ ప్లేట్ మీద వేసి పాటు చేస్తుంది. దాంతో మురారి ప్రయత్నం విఫలమవుతుంది.
కాసేపటికి చేపల ఫ్రై చేస్తాడు మురారి. ఆ తర్వాత చేపలు ఫ్రై అయ్యాక.. ఒక ప్లేట్ లో మళ్లీ లవ్ సింబల్ తో సెట్ చేసి కృష్ణకి ఇద్దామని అనుకుంటాడు. అప్పుడు ముకుంద అక్కడున్న రాజనర్స్ కి కాల్ చేసి.. "మురారి ఫిష్ ని సెట్ చేస్తున్నాడు.. దానిని నాకు అర్జెంట్ గా తెప్పించు" అని అంటుంది. ఒక అబ్బాయి వచ్చి ఆ ఫిష్ ముక్కని తీసుకుంటాడు. ఏం చేస్తున్నావ్ అని మురారి అడుగగా.. రాజనర్స్ మేడం ఒక పీస్ తీసుకురమ్మన్నారని అతను చెప్తాడు. ఆవిడ తీసుకురమ్మంటే తీసుకుంటావా అని కోపంగా అడుగుతాడు.. పక్కనే ఉన్న కృష్ణ.. పర్లేదు ఒక్కటే కదా తీసుకుపోనీవండని అంటుంది. ఆ తర్వాత కాసేపటికి గులాబీ పూవులతో ఒక టబ్ వాటర్ లో లవ్ సింబల్ ని సెట్ చేస్తాడు. అది చూడకుండా కృష్ణ వచ్చి అందులో టమాట పడేసి చేతులు కడుక్కుంటుంది. ఏం చేస్తున్నావని మురారి అడుగగా.. చేతులకి టమాట రసం అంటుకుందని అందుకే కడుక్కున్నానని కృష్ణ అంటుంది. దాంతో చిరాకు పడతాడు మురారి. ఏం అయింది ఏసీపీ సర్ అని కృష్ణ అడుగగా.. కొన్ని పరిస్థితులలో అంతే మనకు కనిపించేవాటిని సరిగ్గా చూడలేం.. చూసేవటిని కరెక్ట్ గా అర్థం చేస్కోలేమని మురారి అనగా.. ఏసీపీ సర్ అప్పుడప్పుడు మీరు అర్థం కాకుండా భలే మాట్లాడతారని కృష్ణ అంటుంది. అప్పుడప్పుడు నువ్వు కూడా అర్థం కానట్టు భలే నటిస్తావని మురారి అంటాడు.
అదంతా చూసిన ముకుంద.. తన తగదిలోకి వెళ్ళి కృష్ణ, మురారీల గురించి ఆలోచిస్తుంది. ముకుంద, మురారీలు ఒకప్పుడు దిగిన ఫోటోలని మురారికి పంపిస్తుంది. ఒక బాయ్ ద్వారా పంపిస్తుంది. కొరియర్ వచ్చిందని చెప్పి ఇవ్వమని ముకుద పంపిస్తుంది. అతను అలాగే ఇస్తాడు. అది చూసిన మురారి.. రేవతి పంపించిదనుకుంటాడు. అతను విప్పి చూడగా అందులో ముకుందతో మురారి కలిసి ఉన్న ఫోటోలు ఉంటాయి.
"నా దృష్టిలో నువ్వు ఆదర్శ్ భార్యవే అని ఎన్నిసార్లు చెప్పినా తనకి అర్థం కావట్లేదు.. ఇదంతా ముకుంద కావాలనే చేస్తుంది. నా మీద హోప్స్ పెట్టుకోవద్దని ముకుందకి చెప్పేస్తాను
" అని మురారి అనుకుంటాడు. అప్పుడు కృష్ణ వస్తుంది. వెంటనే ఆ ఫోటోలని దాచేస్తాడు మురారి. ఏం అయింది సర్ అలా ఉన్నారని కృష్ణ అడుగగా.. ఏమీ లేదని మురారి అంటాడు. ఏమీ లేదంటున్నాడంటే ఏదో ఉందని అర్థం. అదేంటో ఏసీపీ సర్ చెప్తే గాని నాకు తెలియదని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.