English | Telugu
రాహుల్ సిప్లిగంజ్ తన గుండెల్లో ఉన్నాడని చెప్పిన అషురెడ్డి!
Updated : Jun 27, 2023
రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. ఆర్ఆర్ఆర్ మూవీలోని 'నాటు నాటు' పాట పాడి ప్రపంచమంతా పరిచయమయ్యాడు. తన వాయిస్ తో ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడిన రాహుల్ సిప్లిగంజ్.. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా 'క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్' లో అషురెడ్డితో కలిసి కొన్ని రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి సమాధానమిచ్చాడు రాహుల్.
ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5 ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి. ఆర్జే కాజల్ తన సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా తను ఫ్యామిలితో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి వ్లాగ్ చేయగా దానికి అత్యధిక వీక్షకాధరణ లభించింది. 'క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్' లో మరొక వీడియోని తన ఛానెల్ లో అప్లోడ్ చేసింది కాజల్.
మొన్న అషురెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు రాహుల్ ఎక్కడ అని ఒక ఫ్యాన్ అడిగేసరికి.. నా గుండెల్లో ఉన్నాడని చెప్పిందని అషురెడ్డిని కాజల్ అడుగగా.. "అవును.. రాహుల్ నా గుండెల్లోనే కాదు ఇప్పుడు అందరి గుండెల్లో ఉన్నాడు" అని తెలివిగా చెప్పి తప్పించుకుంది అషురెడ్డి. అయితే మీ ఇద్దరి మధ్య ఉంది స్నేహమా? లేక ఏంటని కాజల్ అడుగగా.. మా మధ్య ఏం లేదు. అప్పుడప్పుడు అలా చిల్ అవుతుంటాం. చిన్నచిన్న వాటికి గొడవపడతామని, వాటిని కవర్ చేసుకోడానికి ఇలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు పెడతామని రాహుల్ చెప్పాడు. మరి వీళ్ళ మధ్య ఏం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.