English | Telugu

రిషి గురించి తెలుసుకున్న మహేంద్ర.. ప్రాణాపాయ స్థితిలో వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌-800లో.. చక్రపాణి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా మహేంద్ర చూసి పిలుస్తాడు. మహేంద్రని చూసి చక్రపాణి ఆశ్చర్యపోతాడు. కాలేజీలో అడిగితే.. మీ కూతురు వసుధార ఎక్కడికో వెళ్ళిందని చెప్పారని చక్రపాణిని మహేంద్ర అడుగగా.. ఓహో వసుధార అబద్ధం చెప్పిందా అని మనసులో అనుకుంటాడు చక్రపాణి. పక్కనే మా ఇల్లు ఉంది రండి అన్ని విషయాలు మాట్లాడుకుందామని చక్రపాణి అనగా.‌ మహేంద్ర తన కార్ చెడిపోయిందని చెప్తాడు. మెకానిక్ వచ్చి రిపేర్ చేస్తుంటాడు. నా కొడుకు ఎక్కడ నాకు నిజం చెప్పండని మహేంద్ర అడుగగా.. ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందామని చక్రపాణి అంటాడు.

చక్రపాణి వాళ్ళ ఇంటికి వెళ్ళిన మహేంద్ర.. తన కొడుకు రిషి ఎక్కడ అని అడిగితే.. నాకు తెలియదని చక్రపాణి అంటాడు. కాఫీ తీసుకురావడానికి చక్రపాణి లోపలికి వెళ్ళగా.. వసుధార వాళ్ళ అమ్మ ఫోటోకి దండ వేసి ఉండటం గమనిస్తాడు మహేంద్ర. ఏంటని చక్రపాణిని అడుగగా.‌. రిషి సర్ ఇంట్లో నుండి వెళ్ళాడని తెలిసిన వెంటనే గుండెపోటుతో చనిపోయిందని చక్రపాణి ఏడ్చేస్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు మహేంద్ర. మీకు మీ భార్య దూరమైంది.. నాకు నా కొడుకు దూరమయ్యాడు ఎలా ఉన్నాడో ఏమో అని మహేంద్ర బాధపడుతుండగా.. రిషి సర్ బాగానే ఉన్నాడని చక్రపాణి అంటాడు. ఏం అన్నారు? నిజం చెప్పండని మహేంద్ర గట్టిగా అడిగేసరికి.. రిషి సర్ వసుధార ఉన్న కాలేజీలోనే లెక్చరర్‌గా చేస్తున్నాడని చెప్తాడు. దాంతో ఆలోచనలో పడిన మహేంద్ర.‌. మరి వసుధార నాకెందుకు అబద్ధం చెప్పిందని మహేంద్ర అనగా.. నేనే చెప్పొద్దని చెప్పా అని మహేంద్రతో చక్రపాణి అంటాడు. సరే అని సంతోషంతో మహేంద్ర రిషి ఉన్న కాలేజీకి వెళ్తాడు.

అదే సమయంలో రిషిని ఫాలో అవుతూ వసుధార నడుస్తుంది. కాసేపు తన గతాన్ని తల్చుకుంటాడు రిషి. అలా తన కార్ దగ్గర ఉండగా.. అందరూ పరుగెడుతుంటారు. ఏం అయిందని ఒకరిని అడుగుతాడు రిషి‌.. వసుధార మేడమ్ కి యాక్సిడెంట్ అయిందని అతను చెప్తాడు. వెంటనే రిషి పరుగెత్తుకుంటూ వసుధార దగ్గరికెళ్ళి తనని చేతులతో మోసుకెళ్ళి కార్ లో పడుకోబెట్టి, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అలా బయటకు రిషి కార్ లో వెళ్ళగా.. ఇటునుండి మహేంద్ర కాలేజీలోకి వస్తాడు. మహేంద్ర వచ్చి కేడీబ్యాచ్ లోని ఒకతడిని రిషి ఎక్కడ అని మహేంద్ర అడుగగా.. సర్ ఇప్పుడే బయటకు వెళ్ళాడని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.