English | Telugu
బొప్పాయి తిన్న స్వప్నపై సీరియస్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ!
Updated : Jun 28, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -133 లో.. స్వప్న హాల్లో కూర్చొని బొప్పాయి తింటూ ఉంటుంది. అక్కడే అందరు ఉంటారు. స్వప్న బొప్పాయి తినడం అపర్ణ చూసి.. ఏం తింటున్నావని అడుగుతుంది. బొప్పాయి తింటున్న అని స్వప్న అనగానే.. అందరూ షాక్ అవుతారు. కడుపుతో ఉన్న అమ్మాయి ఎవరైనా బొప్పాయి తింటారా? నీకు తెలియపోతే ఎవరినైనా అడగాలి కదా అని అపర్ణ స్వప్నపై కోప్పడుతుంది. వెంటనే డాక్టర్ ని పిలిచి చెకప్ చెయ్యాలని అపర్ణ అంటుంది. డాక్టర్ వస్తే నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం విషయం తెలుస్తుందని స్వప్న టెన్షన్ పడుతుంది. రాజ్ ని డాక్టర్ కి కాల్ చేసి రమ్మని ఇందిరాదేవి అంటుంది.
మరొక వైపు అప్పు.. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కళ్యాణ్ తో కబడ్డీ ఆడి గెలుస్తానని మాట ఇస్తుంది. అందుకు కళ్యాణ్ కి రన్నింగ్ ప్రాక్టీస్ చేపిస్తుంది అప్పు. మరొక వైపు స్వప్నని గదిలోకి తీసుకొని వచ్చిన కావ్య.. నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఇప్పుడు డాక్టర్ వచ్చి నీకు కడుపు లేదన్న విషయం చెప్తే అందరూ నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు. నీకు సపోర్ట్ చేసినందుకు నన్ను కూడా అసహ్యించుకుంటారు. ఇంట్లో వాళ్ళకి మనం నిజం చెబ్దామని కావ్య అంటుంది. నిజం చెప్తే నన్ను బయటకు పంపిస్తే.. ఈ దుగ్గిరాల ఫ్యామిలీలో నీకు అడ్డు చెప్పేవాళ్లు ఉండరని ఆలోచిస్తున్నావు అంతే కదా. నువ్వేం అందరికి నిజం చెప్పాల్సిన పని లేదు. టైమ్ వచ్చినప్పుడు చెప్తాను.
నువ్వు మాత్రం సైలెంట్ గా ఉండని కావ్యకి స్వప్న చెప్పి వెళ్తుంది. మరొక వైపు సేట్ నోటికి వేసిన ప్లాస్టర్ తీస్తుంది కనకం. నువ్వు ఎందుకు మా ఇంటిని తీసుకుంటాన్నానని అంటున్నావ్. నీకు ప్రతీ నెల వడ్డీ కడుతున్న అయినా ఎందుకు ఇలా చేస్తున్నారని సేటుని కనకం అంటుంది. నన్ను కిడ్నాప్ చేస్తారా? మీ సంగతి చెప్తానని సేట్ అనగానే.. నాకేం తెలియదని మీనాక్షి అంటుంది. అసలు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిందే నువ్వు. నువ్వు ఇంటికి రావడం. నన్ను తీసుకురావడం. అంతా సిసిటీవీలో రికార్డు అయి ఉంటుందని సేట్ చెప్పగానే.. మీనాక్షి కంగారు పడుతుంది.
ఆ తర్వాత సేటు అలా మాట్లాడుతుంటే కనకంకి కోపం వచ్చి మళ్ళీ నెత్తిపై కర్రతో కొడుతుంది. మరొక వైపు డాక్టర్ వచ్చి నేను ప్రెగ్నెంట్ కాదని ఇంట్లో వాళ్లకి చెప్తే రాహుల్ కూడా నన్ను బయటకు పంపించేస్తాడని టెన్షన్ పడుతుంది స్వప్న. అప్పుడే డాక్టర్ వస్తుంది. స్వప్నని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.