English | Telugu
ఫస్ట్ నైట్ తర్వాత మళ్ళీ ఇప్పుడే.. స్వీట్స్ తో లిప్ లాక్స్!
Updated : Jul 2, 2023
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో మంచి హాట్ హాట్ సీన్స్ తో లిప్ లాక్స్ తో ఒక చిన్న సైజు మూవీని తలపించింది. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న యాదమ్మరాజు- స్టెల్లా విడాకులు తీసుకుందామని అనుకున్నారు. యాదమ్మ రాజు సెల్ కి పాస్వర్డ్ పెట్టుకోవడంతో వచ్చిన తిప్పలు ఈ షోకి మెయిన్ పాయింట్. ఇక గ్రాండ్ గా విడాకుల ఫంక్షన్ ని సెలెబ్రేట్ చేసుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు మిగతా జోడీస్ అంతా వచ్చి వాళ్ళను కలపడానికి తెగ ట్రై చేశారు. ఇందులో భాగంగా ప్రీతీ నిగమ్ - నగేష్, అంజలి - పవన్, సిద్-విష్ణు , నూకరాజు - ఆసియ, సత్తిపండు వాళ్ళ వైఫ్, దొరబాబు అతని భార్య అమూల్య అందరూ వచ్చారు.
ఇక యాంకర్ రష్మీ హజ్బెండ్స్ చేతులను వెనక్కి కట్టేసింది. వాళ్ళ భార్యలను పిలిచి, ఒక టేబుల్ మీద కొన్ని స్వీట్స్ పెట్టి వాటిని వాళ్ళ నోటితో తీసుకెళ్లి తమ భర్తల నోటికి అందించాలి అని చెప్పింది. ఇక ఈ సెగ్మెంట్ లో జరిగిన ఈ టాస్క్ లో అందరూ బాగా చేశారు. తెగ సిగ్గుపడిపోతూ మరీ వెళ్లి స్వీట్స్ తినిపించారు. "గులాబీ జామున్లు తినే హడావిడిలో మా ఆయన నా పెదాన్ని మూడు సార్లు కొరికేసాడు" అని చెప్పింది అంజలి. "జూమ్ చేస్తే తెలుస్తుంది నేను మా ఆయనకు లిప్ కిస్ పెట్టేసుంటాను" అంది దొరబాబు వైఫ్ అమూల్య. "నాకు మాత్రం నా పెళ్లి రోజు గుర్తొచ్చింది మేడం" అని చెప్పారు సీనియర్ యాక్టర్ నగేష్. "ఫస్ట్ నైట్ ముందు ఇలా తినిపించుకున్నాం..మళ్ళీ ఇప్పుడే స్వీట్స్ తినిపించుకుంటున్నాం " అని తెగ సిగ్గుపడిపోతూ చెప్పింది విష్ణు. "వీళ్లంతా చెప్తుంటే రాంప్రసాద్ సిగ్గు పడుతున్నారని రష్మీ అనేసరికి "సిగ్గు పడడానికి ఏముంటుంది..మా ఇంట్లో స్వీట్స్ ఉండవు" అని చెప్పారు. తర్వాత యాదమ్మ రాజు - స్టెల్లా మధ్య జాంగ్రీ తినిపించుకునేలా చేశారు. ఇలా ఈ సెగ్మెంట్ చాలా స్వీట్ స్వీట్ గా సాగిందని హజ్బెండ్స్ హ్యాపీగా ఉంటే సిగ్గుపడిపోయారు వాళ్ళ భార్యలు.