English | Telugu

శ్రీశైలం వెళ్ళడానికి దుగ్గిరాల ఫ్యామిలీ రెడీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -137 లో... రాజ్ మూలిక కలిపిన పాలు తాగి కావ్య దగ్గరికి వస్తాడు. రాజ్ మత్తులో కావ్య దగ్గరికి వస్తుంటే తనకి భయమేస్తుంది. నన్నేం చేయకండని అరుస్తుంది. అరవకు అంటూ రాజ్ అంటాడు. కాసేపటికి కావ్య ఒళ్ళో రాజ్ పడుకుంటాడు. కావ్య, రాజ్ తో పరిచయం అయినప్పటి నుండి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటుంది. మీరు ఇలా మత్తులో కాకుండా ప్రేమతో ఎప్పుడు దగ్గరికి వస్తారో అని ఎదురు చూస్తున్నా అని కావ్య అనుకుంటుంది.

మరొక వైపు కృష్ణమూర్తి పడుకుని ఉండగా కనకం వచ్చి కృష్ణమూర్తి కాళ్ళు పట్టుకుంటుంది. నన్ను క్షమించండి అని కనకం అంటుంది. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావ్. నిన్ను ఎలా క్షేమించేది. నిలువ నీడ లేకుండా చేసావ్ కదా. చిన్నప్పటి నుండి అప్పు తనకు కావలిసినవి తనే కొనుక్కుంది. ఎలాగూ ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు మన చేతులు మీదుగా జరుగలేదు. కనీసం అప్పు పెళ్లి అయిన ఈ ఇల్లు అమ్మి మంచి వాడిని చూసి నా చేతుల మీదుగా చేద్దామని అనుకున్నా.. ఈ ఇల్లు కూడా లేకుండా చేసావ్ కదా అని కృష్ణమూర్తి అంటాడు. నేను చేసింది తప్పే కానీ అప్పుడున్న పరిస్థితిలో అలా చేయవలిసి వచ్చింది. కానీ ఆ సేటు మన ఇల్లు అన్యాయంగా తీసుకుంటాడని ఇలా చేశానని కనకం చెప్తుంది. కనకం, కృష్ణమూర్తి మాట్లాడుకున్న మాటలు అన్నీ అప్పు వింటుంది. ఎలాగైనా నాన్నకి సహాయంగా ఉండాలని అప్పు అనుకుంటుంది.

మరొక వైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా శ్రీశైలం వెళ్ళాలని అనుకుంటుంది. అందరూ రెడీ అయి హాల్లోకి వస్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తాడు. ఆ తర్వాత స్వప్న అందంగా రెడీ అయి రాహుల్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అందరూ నా గురించి మాట్లాడుకుంటారని రాహుల్ తో అంటుంది. రాహుల్, స్వప్న ఇద్దరు హాల్లో కి వస్తారు. కానీ స్వప్నని ఎవరు పట్టించుకోకుపోవడంతో.. చూసావా కావ్య అందరిని తన వైపు తిప్పుకుంది. ఎవరు నీ గురించి మాట్లాడడం లేదని‌ స్వప్నతో రాహుల్ అంటాడు..

మరొక వైపు కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేసి ప్రాక్టీస్ కి రమ్మంటుంది. ఈ రోజు రావట్లేదని కళ్యాణ్ చెప్తాడు. మరొక వైపు రాజ్ నిద్ర లేచేసరికి కావ్య ఒళ్ళో ఉండడం చూసి ఏమైంది అంటూ టెన్షన్ పడుతూ అడుగుతాడు. కావ్య కావాలనే రాజ్ ని ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.