English | Telugu

నాకు కూడా అప్పట్లో ఒక బేబీ ఉంది

ఆహా వేదిక మీద సర్కార్ సీజన్ 3 ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేసింది. దీనికి "బేబీ" మూవీ టీం వచ్చింది. ఇక ఈ స్టేజి మీదకు రాగానే స్టూడెంట్ ఆడియన్స్ ని చూసి చాలా ఖుషీ ఐపోయాడు హోస్ట్ ప్రదీప్. "మిమ్మల్ని చూడగానే నా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాను..నా కాలేజీ లైఫ్ కూడా గుర్తొస్తుంది..అని చెప్పాడు..కాలేజీ లైఫ్, ఫ్లాష్ బ్యాక్ అంటే చాలు అప్పట్లో జరిగిన ఎన్నో స్టోరీస్ కూడా గుర్తొస్తాయి కదా..మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అటెండెన్స్, మార్కులు కాకుండా..అప్పటి లవ్ స్టోరీస్, క్రష్ లు గుర్తొస్తూ ఉంటాయి. అందరి లైఫ్ లో ఒక స్టోరీ ఉంటది కదా..మన లైఫ్ లో కూడా ఓ బేబీ ఉంటది కదా..నాకు ఆ రోజుల్లో ఒక బేబీ ఉంది.

ఒక రోజు మా అమ్మ అరకేజీ కందిపప్పు తెమ్మని పంపించింది. అప్పుడు నేను ట్రాక్ ఫ్యాన్ట్, టీ షర్ట్ వేసుకుని కిరాణా కొట్టుకెళ్ళా ..అంకుల్ నాకు ఒక అరకేజీ కందిపప్పు ఇవ్వరా అని అడిగేసరికి పక్కనుంచి మరో స్వీట్ వాయిస్ వినిపించింది. అరకేజీ చింతపండు ఇవ్వరా అని అడిగింది ఆ అమ్మాయి. నేను చూసి వావ్ అనుకున్నా..ఇంతలో వెనక నుంచి వాళ్ళ అన్నయ్య వచ్చి అరడజను గుడ్లు ఇవ్వరా అంకుల్ అన్నాడు. అక్కడితో మనం కట్టు...ఈసారి ధైర్యం చేసి ఎదురింట్లో ఉన్న అమ్మాయికి హలో చెపుదామని డిసైడ్ అయ్యి కావాలనే బాల్ ని వాళ్ళ ఇంట్లోకి వేసి ఆంటీ ఇంట్లోకి బాల్ పడింది అన్నాను..రా బాబు నేను నీగురించి చూస్తున్నాను..ఈరోజు రాఖీ కదా మా అమ్మాయి రాకీ కడతాను అంటోంది అనేసరికి అలా ఆ రోజు నుంచి నా లైఫ్ లో రాకీ కూడా లేదు" అని నిట్టూర్చాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.