English | Telugu

కృష్ణని ప్రేమిస్తున్నాని మురారి చెప్పడంతో ఎమోషనల్ అయిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -197 లో.. కృష్ణని స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు తీసి కాపాడతాడు. కృష్ణని మురారి ఎత్తుకొని వెళ్తుంటే.. సడన్ గా ముకుంద ఎదురుపడుతుంది. నువ్వు ఏంటి ఇక్కడ అని మురారి షాక్ అవుతాడు. రాను అనుకున్నావా? రాలేనని అనుకున్నావా అని ముకుంద అంటుంది. ఎందుకు వచ్చావ్ అని మురారి అడుగుతాడు. "నువ్వు ఎక్కడ ఉంటే.. నేను అక్కడే" అని ముకుంద అంటుంది. సరే నీతో మాట్లాడాలి మళ్ళీ కలుస్తా అని మురారి వెళ్ళిపోతాడు. నీతో కూడా తేల్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయని ముకుంద అంటుంది.

ఆ తర్వాత కృష్ణ అబద్ధం చెప్పినందుకు తనని మురారి ఆటపట్టిస్తుంటాడు. మీరు నిజంగా శాడిస్ట్ అంటూ మురారిని అంటుంది కృష్ణ. అప్పుడే భవాని మురారికి ఫోన్ చేస్తుంది. మురారి ఆదర్శ్ గురించి ఏమైనా తెలిసిందా? అసలు ఆదర్శ గురించి పట్టించుకోవడమే మానేశావని మురారితో భవాని అంటుంది.. లేదు పెద్దమ్మ వారం రోజుల్లో అప్డేట్ ఇస్తా అన్నారని మురారి అంటాడు.. నువ్వు ఆదర్శ్ గురించి పట్టించుకోకుండా ఆ తింగరి పిల్లతో షికారు చేస్తున్నావా అని భవాని అంటుంది. ఆ తర్వాత భవాని ఫోన్ కట్ చేస్తుంది. ఆదర్శ్ ఎక్కడ ఉన్నావ్? త్వరగా రా అని తనలో తాను అనుకుంటాడు మురారి. ఆ తర్వాత ముకుంద దగ్గరికి మురారి వెళ్తాడు. నీకోసం ఎదురు చూస్తున్నా అని ముకుంద అనగానే.. నేను ఈ రోజు కోసం చూస్తున్నానని మురారి అంటాడు. ఇలా ఏకాంతంగా కలిసే రోజు కోసమా అని ముకుంద అనగానే.. నన్ను ఇలా కలవడానికి ట్రై చెయ్యకనే చెప్పే రోజు కోసమని మురారి అంటాడు. మన మధ్య ఇప్పుడు ప్రేమ లేదు. నీకో నిజం చెప్పాలని మురారి అంటాడు. ఏంటి అని ముకుంద అడుగగా.. నేను కృష్ణని ప్రేమిస్తున్నానని మురారి చెప్తాడు. ముకుంద షాక్ అవుతుంది.

ఆ తర్వాత నా విషయంలో నువ్వు తప్పు చేశానని నీకు అనిపించడం లేదా అని ముకుంద అడుగుతుంది. అనిపిస్తుంది నా ప్రాణ స్నేహితుడికి ఇచ్చి నీకు పెళ్లి చేశానని కానీ ఇప్పుడు నువ్వు నా ప్రాణస్నేహితుడి భార్యవి అని మురారి అంటాడు. నా ప్రేమ నీకే.. నీ ప్రేమ నాకే ఇదే. నా సంకల్పం అని ముకుంద అంటుంది. మన విషయం భవాని అత్తయ్యకి చెప్తానని ముకుంద అనగానే.. అల్ ది బెస్ట్ అని మురారి అంటాడు. మురారి మాటలకి ముకుంద ఎమోషనల్ అవుతుంది. ఇవన్నీ నిజాలు ఎప్పటికైనా ఇంట్లో వాళ్లకి తెలిసేవే.. నేను మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలని మురారి అనుకుంటాడు.. ఆ తర్వాత మురారి దగ్గరికి కృష్ణ వచ్చి సరదాగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.