English | Telugu
హీరో రోనాక్ తో డాన్స్.. ఫైర్ ఐన ఇంద్రజ.. తనకు విడాకులు కావాలన్న రష్మీ
Updated : Jul 2, 2023
ఈవారం శ్రీదేవి డ్రామా కంపెనీకి "కనులు తెరిచినా కనులు మూసినా" మూవీ ప్రొమోషన్స్ కోసం సాయి రోనాక్, అభిలాష్, డైరెక్టర్ సందీప్ టీం వచ్చింది. ఇక సాయి రోనాక్ ని చూసేసరికి రష్మీ కళ్ళల్లో ఆనందం కనిపించింది. "ఈ ఎపిసోడ్ నాకు బాగుంది. అందరికీ జోడీలు వున్నారు. నాకు మాత్రం వీళ్ళు ఉన్నారు" అని మూవీలోని కుర్రాళ్లను చూపించింది. ఇక మూవీ గురించి ఈ ముగ్గురు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని చెప్పుకొచ్చారు. తర్వాత రాంప్రసాద్ లైన్ లోకి వచ్చి "మా రష్మీ హీరోతో కలిసి డాన్స్ చేస్తే చూడాలనుంది" అని అడిగాడు. "ఆ రొమాంటిక్ సాంగ్ కూడా గాలోడు మూవీ నుంచి చేయాలి" అని నూకరాజు అనేసరికి "వద్దులేరా క్యాన్సిల్" అన్నాడు రాంప్రసాద్. "ఉన్న మూడ్, ఉత్సాహం అన్నీ పోయాయి " అని రష్మీ అనేసరికి "ఇంతవరకు సైలెంట్ గా ఉన్నాను..ఏమిటి ఏం అంటున్నావ్.." అని ఇంద్రజ ఫైర్ అయ్యేసరికి " ఈ ఎపిసోడ్ కి ఎక్స్క్యూజ్ చేయండి మేడం" అంది రష్మీ. "కళ్ళు తెరిచే చూడు రష్మీ పక్కన రీల్ హీరో.. కళ్ళు మూసి చూడు అక్కడ రియల్ హీరో" అని సుదీర్ గురించి తెగ పొగిడేసింది ఇంద్రజ.
ఈ డ్రామా అంతా చూస్తున్న మూవీ టీమ్ కి ఏం అర్ధం కాకపోయేసరికి "మాదొక ఫామిలీ ఎపిసోడ్ అండి.. ఇంద్రజ గారు అమ్మ, రష్మీ కోడలు, కొడుకేమో సుధీర్ ఆస్తి తగాదాలు వచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు" అని రాంప్రసాద్ చెప్పేసరికి "మీరే కదా పంపేశారు..ద్రోహి " అన్నారు ఇంద్రజ. "మనం ఫ్రెండ్ గా ఏం కోరుకుంటామండీ డెవలప్ కావాలని కదా అందుకే పంపించాం..వాడు డెవలప్ కాకుండా ఏదేదో ఐపోయాడు" అని చెప్పాడు రాంప్రసాద్. తర్వాత రాంప్రసాద్ చెప్పేసరికి బ్యాక్ డ్రాప్ లో " ఓ ప్రియా ప్రియా" అనే సాంగ్ ప్లే అవడంతో రష్మీ, సాయి రోనాక్ ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. అది చూసిన ఇంద్రజ చాలా ఫీలైపోయింది. "మీరు మారిపోయారమ్మా.. ఆ గాలోడి కోసం బాధపడుతూ ఉండే మీ కళ్ళు ఆనందపడుతున్నాయి" అని గట్టిగా అరుస్తూ చెప్పాడు నూకరాజు. "జస్ట్ చిన్న లీడ్ ఇచ్చాను రెచ్చిపోయిందిరా రష్మీ" అని సుధీర్ కి ఫోన్ చేసి చెప్పాడు రాంప్రసాద్. "వాళ్ళు రెచ్చగొట్టారు..నేనేం చేయలేదు" అంది రష్మీ ఏడుపు ముఖంతో.."రెచ్చగొడితే రెచ్చిపోతారా అమ్మా ..అక్కడ బాబుని చాలా మంది రెచ్చగొడుతున్నారు ...బాబు రెచ్చిపోయాడా" అన్నాడు నూకరాజు. "నాకు కూడా ఒక విడాకుల ఈవెంట్ పెట్టండి ఇంకా" అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగేసరికి "ఇక మీకు విడాకులు లేవమ్మా మావిడాకులే" అని నూకరాజు అనేసరికి అందరూ నవ్వేశారు.