English | Telugu
కృష్ణ, మురారి విడిపోతారని చెప్పిన పంతులు!
Updated : Jul 2, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -198 లో.. కృష్ణ, మురారి ఇద్దరు సరదాగా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళని దూరంగా ఉండి ముకుంద చూస్తుంటుంది. కృష్ణ బాటిల్ ని తిప్పుతుంది. ఏసీపీ సర్ ట్రూత్ వచ్చింది, నిజమే చెప్పాలని కృష్ణ అంటుంది. అప్పుడే ముకుంద కాల్ చేస్తుంది. మురారి ఫోన్ కట్ చేస్తుంటే.. మళ్ళీ మళ్ళీ చేసి మురారిని విసిగిస్తుంది. ఎవరు చేస్తున్నారు. ఆ డైరీ లో ఉన్న అమ్మాయేనా చేసేదని కృష్ణ అనుకుంటుంది.
ఆ తర్వాత ముకుంద మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడంతో మురారి ముకుంద దగ్గరికి వచ్చి.. ఫోన్ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావని అడుగుతాడు. నువ్వు ఎందుకు కట్ చేస్తున్నావని ముకుంద అంటుంది. ఇంత చెప్పినా నీతో మాట్లాడం వేస్ట్ అని చెప్పి మురారి వెళ్ళిపోతాడు. కృష్ణ దగ్గరికి వెళ్ళిన మురారి.. కృష్ణ మనం వెళ్ళాలి, నాకు అర్జెంటు వర్క్ ఉందని మురారి అంటాడు. ఎందుకు సర్ అబద్దం చెప్తున్నారు. మీ కాలర్ పట్టుకొని మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్పాలని ఉందని కృష్ణ అనుకుంటుంది. కృష్ణ, మురారి ఇద్దరు బయల్దేరతారు. మీ మనసులో ఎవరు ఉన్నారో తెలుసుకొని తప్పుకుంటే అర్థం ఉంది. ఎటూ తేల్చుకోలేక తప్పుకుంటే అవివేకం అవుతుందని కృష్ణ అనుకుంటుంది. "ముకుంద ఎందుకు ఇలా చేస్తుంది. అప్పుడు బాధపడ్డాను. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను. కృష్ణ నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను చెప్పలేక పోతున్నాను. సారి కృష్ణ" అని మురారి అనుకుంటాడు. మరొక వైపు కృష్ణ, మురారి లు వస్తున్న విషయం తెలిసి రేవతి వాళ్ళిద్దరికి ఫోన్ చేస్తుంది. ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చెయ్యరు. ఆ తర్వాత పంతులు గారి దగ్గరికి రేవతి వెళ్లి.. కృష్ణ, మురారీల గురించి అడుగుతుంది. కృష్ణ మురారి విడిపోతారు. వాళ్ళని ఒకరు విడదీస్తారని పంతులు చెప్తాడు. రేవతి టెన్షన్ పడుతూ అలా జరగకుండా ఉండడానికి పరిష్కారం చూడండని అంటుంది. సరే నాకు కొంచెం టైం కావాలి అని పంతులు అంటాడు.
మరొక వైపు రేవతి ఇంటికి వస్తూ.. పంతులు అన్న మాటలే గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత అలేఖ్య, మధు ఇద్దరు ఎప్పటిలాగే పొట్లాడుకుంటారు. ఆ తర్వాత ముకుంద ఇంటికి వస్తుంది. ఏం తెలియనట్లుగా కృష్ణ, మురారిలు ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. ఫామ్ హౌస్ కి వెళ్లారని అలేఖ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.