English | Telugu
గెస్ట్ హౌస్ కి వెళ్ళిన జగతి, మహేంద్ర!
Updated : Jul 2, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -804 లో.. మహేంద్ర దగ్గరికి జగతి వస్తుంది. జగతి రావడంతోనే మహేంద్ర ఆమెని హత్తుకుని ఇన్ని రోజులు నిన్ను బాధపెట్టాను సారి అని చెప్తాడు. రిషికి నీపై కోపం ఇంకా పెరిగిపోవచ్చు.. ఇక నిన్ను ఎప్పుడు అమ్మ అని పిలవడేమో అని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. లేదు మహేంద్ర నన్ను రిషి అమ్మ అని పిలిచాడు కానీ ఆ సిచువేషన్ లో పిలుస్తాడని నేను అనుకోలేదంటూ జగతి అంటుంది.
మళ్ళీ రిషి తిరిగి రావాలి, కాలేజీ బాధ్యతలు చేపట్టాలని జగతి అంటుంది. తప్పకుండా వస్తాడు కానీ మనం ఈ ఇంట్లో ఉండొద్దు.. కీడు చేసే మనుషుల మధ్య ఉండాలని లేదు.. నా తొందరపాటు వల్ల అన్నయ్య ముందు నోరు జారుతానని మహేంద్ర అంటాడు. ఇక ఇద్దరు కాలేజీ గెస్ట్ హౌస్ కి వెళ్లాలనుకుంటారు. మరొక వైపు ఏంజిల్, విశ్వనాథ్ ఇద్దరు బయటకు వెళ్ళడానికి రెడీ అవుతారు. వసుధార దగ్గరికి ఏంజిల్ వచ్చి నీకు కావలిసినవి అన్ని ఇక్కడే పెట్టేసాను.. ఏమైనా అవసరం ఉంటే రిషిని పిలిచి అడుగు అని వసుధారకి ఏంజిల్ చెప్తుంది. ఆ తర్వాత రిషి దగ్గరికి వెళ్లిన ఏంజిల్.. తనకొక హెల్ప్ చెయ్యాలని అడుగుతుంది. వసుధారకి ఏమైనా అవసరం ఉంటే దగ్గర ఉండి చూసుకో అని ఏంజిల్ చెప్పి వెళ్తుంది. మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు బ్యాగ్ సర్దుకొని గెస్ట్ హౌస్ కి వెళ్ళడానికి హాల్లోకి వస్తారు. వాళ్ళని చూసిన దేవయాని ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. గెస్ట్ హౌస్ కి.. మిషన్ ఎడ్యుకేషన్ పనులు అక్కడ ఉండి చూసుకుంటే ఎక్కువ టైం కేటాయించవచ్చని వెళ్తున్నామని మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళిపోతారు.
బాబాయ్ లో ఏదో మార్పు వచ్చింది.. బాబాయ్ కి, పిన్ని నిజం చెప్పేసిందా అని దేవయానితో శైలేంద్ర అంటాడు. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు మంచి టైం దొరికింది. కాలేజీని మన సొంతం చేసుకోవాలని దేవయాని అంటుంది. ఆ తర్వాత ఫణీంద్ర ఇంటికి వచ్చి మహేంద్రని పిలువగా.. జగతి, మహేంద్ర ఇద్దరు గెస్ట్ హౌస్ కి వెళ్లిన విషయం ధరణి చెప్తుంది. నువ్వు ఎలా వెళ్ళనిచ్చావని దేవయానిని ఫణీంద్ర కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.