English | Telugu
ఒక కుటుంబం కల నెరవేర్చిన కృష్ణ, మురారి!
Updated : Jul 2, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సరికొత్త మలుపుకి తిరగనుందా అంటే అవుననే చెప్పాలి. తాజా మంగళవారం నాటి ఎపిసోడ్ ప్రోమోలో కృష్ణకి ముకుంద ఎదురవుతుంది. అక్కడ ఫామ్ హౌస్ లో ముకుందని చూసిన కృష్ణ షాక్ అవుతుంది. ఇక్కడ నువ్వేంటి ముకుంద అని అడిగిన కృష్ణని.. పక్కకి తీసుకెళ్తుంది ముకుంద.
ఈ సీరియల్ లో మొదటగా మురారి, ముకుంద ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళిద్దరూ దూరమవుతారు. మురారి పోలీస్ గా ఉద్యోగం వచ్చాక.. ఒక క్రిమినల్ ని పట్టుకునే పరిస్థితులలో.. మురారి కింద హెడ్ కానిస్టేబుల్ గా చేస్తున్న కృష్ణ వాళ్ళ నాన్న చనిపోతాడు. అయితే వాళ్ళ నాన్నని మురారి చంపడం చూసిన కృష్ణ షాక్ అవుతుంది. తను చనిపోతున్నానని తెలుసుకున్న కృష్ణ వాళ్ళ నాన్న.. మురారీతో కృష్ణ పెళ్ళి జరిపిస్తాడు. అయితే మురారి వాళ్ళ అన్న ఆదర్శ్, ముకుందని పెళ్ళి చేసుకుంటాడు. అయితే అదే సమయంలో ముకుంద, మురారిని ప్రేమిస్తుందని తెలుసుకున్న ఆదర్శ్ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అలా ముకుంద ఒక్కతే ఉండి, కృష్ణ మురారీలు కలిసి ఉండటాన్ని చూడలేకపోతుంది.
ఎలాగైనా కృష్ణ, మురారీలను విడదీయాలని ముకుంద చూస్తుంటుంది. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో కృష్ణ, మురారీ ఇద్దరు కలిసిపోవాలని రేవతి వాళ్ళ ఫామ్ హౌస్ కి పంపిస్తుంది. అయితే వాళ్ళకంటే ముందే ముకుంద వెళ్ళి.. అక్కడ ఫామ్ హౌస్ ని చూసుకుమే ఆమెకు డబ్బులు ఇచ్చి తను కొన్నిరోజులు అక్కడ ఉంటానని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటుంది. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో పంతులు దగ్గరికి వెళ్ళిన రేవతికి కృష్ణ, మురారీ విడిపోతారని చెప్పడంతో తను టెన్షన్ పడుతూ ఉండగా, వాళ్ళిద్దరిని విడదీయాలని ముకుంద ప్లాన్ చేస్తుంటుంది. ఇలాంటి అంశాలతో ఈ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది.
కాగా ఇప్పుడు మురారి( ముఖేష్ గౌడ), కృష్ణ(ప్రేరణ కంబం) ఒక పేద కుటుంబానికి అండగా నిలిచారు. 'ఎచ్ఆర్ ఫర్ యూ' అనే యూట్యూబ్ ఛానెల్ ని రన్ చేస్తూన్న ఒక యూట్యూబర్ కృష్ణ, మురారీల చేత వారికి ఆర్థిక సాయం అందించాడు. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.