English | Telugu

ఆ ఇద్దరి మధ్య మౌన పోరాటం.. ఆదర్శ్ ఆచూకి భవాని కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -243 లో.. ఇంత దూరం వచ్చి నేనే వెళ్లి కృష్ణతో మాట్లాడితే మరి తగ్గినట్టు ఉంటుందని మురారి అనుకుంటాడు. మరొక వైపు మురారికి కృష్ణ ఎదురుగా వస్తుంది. మురారిని చూసిన కృష్ణ ఇదంతా భ్రమే అనుకుని మురారి ముందు నుండే వెళ్తుంది.

ఆ తర్వాత కృష్ణ అలా వెళ్లడం చూసిన మురారి.. అదేంటి చూసి కూడా చూడనట్టు వెళ్తుంది.. మర్చిపోయిందా అని మురారి అనుకుంటాడు. అయిన సరే నేను వెళ్లి మాట్లాడనని మురారి అనుకుంటాడు. మరొకవైపు భవాని దగ్గరికి శ్రీనివాస్ వస్తాడు. మీ అమ్మాయి పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించిందని భవాని అనగానే.. ఏమీ తెలియనట్టు షాక్ అవుతాడు శ్రీనివాస్. మీకు అంత తెలుసని నాకు తెలుసని భవాని అంటుంది. శ్రీనివాస్ మౌనంగా ఉంటాడు. మీ అమ్మాయి ఎవరిని ప్రేమించిందో, మీకు ఏమైనా తెలుసా అని శ్రీనివాస్ ని భవాని అడుగుతుంది. ఒకవేళ తెలియకపోయిన ముకుంద ద్వారా తెలుసుకొని నాకు చెప్పండని భవాని అంటుంది.

సరే అని శ్రీనివాస్ బయలుదేరి వెళ్తాడు. ఆ తర్వాత వెళ్తున్న శ్రీనివాస్ ని రేవతి ఆపి మాట్లాడుతుంది. ముకుంద ప్రేమించింది మురారిని అనే విషయం అక్కతో చెప్పకండని రేవతి చెప్తుంది. మరొక వైపు కల్నల్ తో భవాని ఫోన్ లో మాట్లాడుతుంది. నేను ఒకసారి ఆదర్శ్ తో మాట్లాడాలి.. వాడు నా మాట వింటాడని భవాని అంటుంది. లేదు ఆదర్శ్ మాతో నే డైరెక్ట్ కాంటాక్ట్ లేడని కల్నల్ చెప్తాడు. మరొక వైపు కృష్ణ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తూ బిజీ గా ఉంటుంది. ఒక పేషెంట్ కృష్ణ దగ్గరికి వస్తుంది. ఆమెని చూసిన కృష్ణ ఈ దెబ్బలు అన్ని ఏంటి? మీ ఆయన తాగి వచ్చి కొడుతున్నాడా అని ప్రశ్నలు అడుగుతుంది. లేదు నా భర్త వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. అదేంటని అడిగితే ఇలా కొట్టాడు. అయిన తన మీద నాకు కోపం లేదు. నా భర్త ఎప్పటికైనా మారి నా దగ్గరికి వస్తాడని ఆ పేషెంట్ చెప్పగానే.. మురారిని గుర్తుచేసుకుంటుంది కృష్ణ.

మరొక వైపు మురారికి రేవతి ఫోన్ చేసి.. టైమ్ కి తిను అంటూ జాగ్రత్తలు చెప్తుంటుంది. సరేనని చెప్పి మురారి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత మురారికి కృష్ణ ఎదురుగా వస్తుంది. ఏంటి మళ్ళీ ఏసీపీ సర్ ల అనిపిస్తుందని మళ్ళీ భ్రమ అని అనుకుంటుంది కాని మురారి కృష్ణ వెళ్తుంటే చెయ్యి అడ్డం పెడుతాడు. ఏంటి కృష్ణ చూసి కూడా చుడనట్టు వెళ్తున్నావ్ అని అడుగుతాడు. ఏసీపీ సర్ నిజంగానే వచ్చారా అని కృష్ణ అనుకుంటుంది. కావాలనే మురారి వర్క్ ఉంది అంటూ వెళ్తాడు. కృష్ణ కూడా అలాగే వర్క్ ఉంది అంటూ వెళ్తు ఇద్దరు వెనక్కి తిరిగి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు అగలిసిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.