English | Telugu

అది నా పిల్ల..డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ

స్టార్ మాలో మంచి రేటింగ్ తో పాటు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ‘నీతోనే డాన్స్’ షోకు విజయ్ దేవరకొండ వచ్చి సందడి చేయబోతున్నారు. ఇప్పటికీ రేస్ టు ఫినాలే పూర్తి చేసుకుని గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చింది. దానికి సంబందించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక అందులో సెలబ్రెటీల పర్ఫామెన్స్ మామూలుగా లేవు. ఒకరితో ఒకరు గట్టిగానే తలపడ్డారు. స్టెప్పులతో స్టేజిని అదరగొట్టేశారు. మధ్యలో శ్రీముఖి కూడా వాళ్ళతో కలిసి ఎంటర్టైన్ చేసింది. ఖుషి మూవీ ప్రమోషన్స్ భాగంలో విజయ్ దేవరకొండ కూడా ఈ షోకి వచ్చి బాగా సందడి చేశాడు. ఎంట్రీతోనే ‘‘అది నా పిల్ల’’ అని డైలాగ్ వేస్తూ వచ్చి ఖుషి మూవీలో సాంగ్ కి డాన్స్ చేశాడు.

శ్రీముఖి అక్కడ పెర్ఫార్మ్ చేసిన సెలబ్రిటీలను తీసుకొచ్చి ఇందులో వీళ్లకు పెళ్లిళ్లయ్యి ఎన్నేళ్ళయిందో చెప్పమని అడిగింది. నటరాజ్ మాస్టర్ కు ఐదేళ్లు అయ్యింది అనడంతో వెంటనే మాస్టర్ అందుకుని 13 ఇయర్స్ అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక "మీ పెళ్లి ఎప్పుడు" అని శ్రీముఖి విజయ్ ని అడిగేసరికి " అందరితో మాట్లాడుతున్నాను" అని విజయ్ చెప్పడంతో "అందరిని చేసుకోవడం కుదరదు కదా" అంటూ శ్రీముఖి పంచ్ వేసింది. ఇక ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని అంటున్నారని, మా అమ్మ నాన్నకి మనవాళ్ళు, మనవరాళ్లు కావాలట అని తొందర పెడుతున్నారు అనేసరికి రాధ వారి సంతోషం కోసం చేసుకోవాలి కదా అని అన్నారు. అందుకే వాళ్లనే మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పానని విజయ్ అనటంతో అక్కడ అందరూ నవ్వేశారు. ఇక జోడి కంటెస్టెంట్స్ చేసిన డాన్స్ లు మాములుగా లేవు. ఇరగదీసే డాన్సులు చేశారు. మరి ఎవరు టైటిల్ విన్ అవుతారో కొద్దీ రోజుల్లో తెలిసిపోతుంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.