English | Telugu

కృష్ణ కోసం స్పెషల్ గా డ్యూటీ వేయించుకున్న మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -242 లో.. ముకుంద తనపై ఇంక ఆశలు పెంచుకుంటుందని భావించిన మురారి.. ఆదర్శ్ ఆచూకీ తెలిసింది, తను త్వరలోనే వస్తున్నాడని మురారి చెప్పగానే.. ముకుంద షాక్ అవుతుంది. నేను నిన్ను తప్ప ఎవరిని నా భర్తగా ఉహించుకోలేనని ముకుంద ఖచ్చితంగా చెప్పి వెళ్తుంది. దాంతో మురారికి ఏం చెయ్యాలో అర్థం కాదు.

మరొకవైపు మురారిని గుర్తు చేసుకుంటు కృష్ణ ఉంటుంది. మురారి క్యాంపు దగ్గరికి వెళ్తుంటే ముకుంద అడ్డుపడుతుంది. నీతో మాట్లాడాలని మురారితో ముకుంద చెప్తుంది. నువ్వు చెప్పింది అబద్ధమని నాకు తెలుసు. అయినా నాకు ఆదర్శ్ అంటే గౌరవం.. ఒక అమ్మాయి ప్రేమని అర్థం చేసుకుంటాడు. పెళ్లికి ముందు వరకు నేనే ఆదర్శ్ కి కాబోయే భార్య అని నీకు తెలియదు. నీ ప్రాణ స్నేహితుడు ఆదర్శ్ అని నాకు తెలియదు. మన ప్రేమ గురించి ఆదర్శ్ కి తెలియదు. ఇందులో ఎవరి తప్పు లేదు. మీ ఇద్దరి అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి ఇన్ని రోజులు అందరికి చెప్తానని వట్టిగనే బెదిరించాను.. నేను చెప్పను బలవంతంగా ప్రేమ ఉండకూడదు. స్వచ్ఛంగా ఉండాలని ముకుంద అంటుంది. నేను నిన్ను అర్థం చేసుకొవడం లేదో? నువ్వు నన్ను అర్ధం చేసుకోవడం లేదో అర్థం కావట్లేదు కానీ మన వల్ల ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదని మురారి మనసులో అనుకుంటాడు. నువ్వు నా వాడివి.. నేను నీ దాన్ని అని ముకుంద చెప్తుంది. మురారి మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

మరొక వైపు కృష్ణ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే బయట ఒక పోలీస్ కి దెబ్బలు తాకాయని ఎవరో వచ్చి చెప్పగానే.. మురారి అనుకొని కృష్ణ కంగారుగా వెళ్తుంది కానీ అది మురారి కాదు. దెబ్బలు తగిలిన అతనికి కృష్ణ ట్రీట్మెంట్ ఇస్తుంది. మరొక వైపు మురారి క్యాంపు అంటు వచ్చింది కృష్ణ ఉన్న చోటుకె.. పై ఆఫీసర్ లను రిక్వెస్ట్ చేసి మరి ఇక్కడికి డ్యూటీ వేయించుకుంటాడు మరారి. కృష్ణ కోసమే అయిన తనే తన దగ్గరికి రావాలని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.