English | Telugu
గ్రాండ్ గా విష్ణుప్రియ బర్త్ డేని సెలెబ్రేట్ చేసిన సిద్దార్ధ్
Updated : Aug 23, 2023
బుల్లితెర మీద నటించే విష్ణు ప్రియా గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సిద్దార్ధ్ వర్మని లవ్ మ్యారేజ్ చేసుకున్న సిద్-విష్ణు అయ్యింది. సిద్దార్థ్ వర్మ కూడా నటుడే. బుల్లితెర మీద, సిల్వర్ స్క్రీన్ మీద నటిస్తాడు. వీళ్ళు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. యూట్యూబ్ లో కూడా రకరకాల వీడియోస్ ని అప్ లోడ్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు విష్ణు ప్రియా బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు సిద్దార్థ్. కేక్ తీసుకొచ్చి కట్ చేయించాడు. సిద్దార్థ్, విష్ణు ప్రియా వాళ్ల అబ్బాయి అయాన్ష్ వర్మ ముగ్గురు కలిసి వాళ్ల ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు జానకి కలగనలేదు టీమ్ మొత్తం వచ్చి బర్త్ డే బాష్ చేశారు. విష్ణుప్రియ ఫోటోని బ్యానర్ చేయించి ఇంటి ఎంట్రన్స్ లో పెట్టారు. అలాగే ఉప్మా కేక్ తెప్పించి ఆమెతో కట్ చేయించి తినిపించారు. తర్వాత ఫోటో షూట్ కి వెళ్లారు.
ఇక ఫామిలీ నంబర్ 1 షోకి మంచి రేటింగ్ వచ్చిందని వాళ్లకు ఇచ్చిన స్వీట్ బాక్స్ ని కూడా చూపించారు. ఇక ఫామిలీ నంబర్ 1 షూటింగ్ కి వెళ్లారు వీళ్లంతా కలిసి. ఇక ఆ సెట్ లో అందరూ కలిసి విష్ణు బర్త్ డే సెలెబ్రేషన్స్ చేశారు. బర్త్ డే ఐపోయిన సెకండ్ డే కూడా శ్రీసత్య, భావన కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. రభస, రామయ్య వస్తావయ్యా వంటి మూవీస్ లో సమంత పక్కన నటించింది విష్ణు ప్రియా. "జానకి కలగనలేదు" సీరియల్ మెయిన్ రోల్ ప్రియాంక జైన్ కి తోటి కోడలి రోల్ లో నటించింది. విష్ణుప్రియ కెరీర్‌లో ఇప్పటివరకు 40 సినిమాల్లో నటించింది . నిజానికి వాటి తర్వాతే సీరియల్స్‌లోకి వచ్చింది. "త్రినయని" సీరియల్ కంటే ముందు 'ఇద్దరు అమ్మాయిలు ', "అభిషేకం" వంటి సీరియల్స్‌లో కనిపించి అలరించింది. 14 ఏళ్ల వయసులో విష్ణు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కెరీర్ మంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.