English | Telugu

సీరియల్ ఐపోయింది.. ఆదాయం ఎలా?

ఒక సీరియల్ ఐపోయింది అంటే అందులో పని చేసే టీమ్ మొత్తానికి కూడా పని అక్కడితో ఐపోయినట్టే. ఆదాయం కూడా ఇక బ్రేక్ ఐనట్టే. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సిందే . ఇక ఇప్పుడు ప్రియాంక జైన్ కూడా అలాంటి సిట్యుయేషన్ నే ఫేస్ చేస్తోంది. తాను నటిస్తున్న "జానకి కలగనలేదు" సీరియల్ ఎండ్ ఐపోయేసరికి తనకు ఆదాయం తగ్గిపోయిందని చెప్పుకుని బాధపడింది. ఐతే ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి కాబట్టి అప్పటి వరకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనీ చూస్తోందట. మరి నిత్యం ఆదాయం ఉండే బిజినెస్ ఎప్పటికీ రెండే రెండు అని అవే ఫుడ్ బిజినెస్, టెక్స్టైల్ బిజినెస్ అని చెప్పింది. ఐతే ఫుడ్ బిజినెస్ ఐతే చాలా మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి టెక్స్టైల్ బిజినెస్ సెల్ ద్వారా రన్ చేయొచ్చు కాబట్టి అదే చేయడానికి రెడీ అయింది. ఐతే మంచి టెక్సటైల్స్ కి పెట్టింది పేరు సూరత్ కాబట్టి ఫ్లయిట్ లో అక్కడికి వెళ్ళింది ప్రియాంక జైన్.

అలా అక్కడకి వెళ్లి శారీస్, లెహంగాస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుంది. ప్రియాంకతో పాటు శివ్ కూడా వెళ్లి హెల్ప్ చేసాడు. అలాగే వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ ని తీసుకురాబోతున్నట్లు చెప్పింది ప్రియాంక. తన హైదరాబాద్ లో స్టార్ట్ చేయబోయే కొత్త షాప్ కి రావాలని శివ్-పరి కోరారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి రీసెంట్ గా నీతోనే డాన్స్ షోలో పార్టిసిపేట్ చేశారు. ఐతే శివ్ కి హెల్త్ ఇష్యూ రావడంతో ఈ షో నుంచి డ్రాప్ అయ్యారు. ఇక ప్రియాంక మాత్రం ఈసారి టెక్స్టైల్ షాప్ పెట్టి మంచి లాభాలు తెచ్చుకోవాలని చూస్తోంది. ప్రియాంక జైన్, శివ కుమార్.. ‘మౌనరాగం’ సీరియల్ నుంచి రిలేషన్‌లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు.