English | Telugu

లావణ్యనే నా ఫోన్ లో తన పేరు మార్చింది.. ఫస్ట్ గిఫ్ట్ గుర్తులేదన్న వార్న్

ప్రతీ శనివారం ‘సుమ అడ్డా’ షోలో కొత్త కొత్త సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ శనివారం హీరో వరుణ్ తేజ్‌ను తీసుకొచ్చింది. వరుణ్ తేజ్ కొత్త మూవీ ‘గాండీవధారి అర్జున’ ప్రమోషన్స్ కోసం వచ్చారు. తనతో పాటు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, హీరోయిన్ సాక్షి వైద్య కూడా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ‘సుమ అడ్డా’లో వరుణ్ తేజ్‌ తో ఫేమస్ మూవీ స్ఫూఫ్ చేయించింది.. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘గబ్బర్‌సింగ్’ మూవీ స్ఫూఫ్‌ను చేయించింది. "నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది" అని డైలాగ్ చెప్పాడు. "సాక్షి వైద్య ... మీ అత్తారిల్లు ఎక్కడ అయితే బాగుంటుంది" అంటూ సుమ అడిగేసరికి దానికి సమాధానంగా సాక్షి.. తనకు హైదరాబాద్ అంటే ఇష్టమని చెప్పింది.

"ఎక్కడెక్కడి నుండో వస్తూ ఇక్కడ కోడళ్లు అయిపోతున్నారు" అంటూ లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి సుమ కామెంట్ చేసేసరికి వరుణ్ తేజ్ నవ్వేసి "హైదరాబాద్ అబ్బాయిలు మంచోళ్లు కాబట్టి అలా అవుతున్నారు" అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఫైనల్ గా చిరంజీవి పాటల్లో ఒకటైన ‘నవ్వింది మల్లెచెండు’ అనే సాంగ్ కి సుమ డ్యాన్స్ చేసి నవ్వించింది. వరుణ్ తేజ్ చిన్నప్పటి ఫోటోలను చూపించింది. చిన్నప్పుడు రామ్ చరణ్.. వరుణ్ తేజ్‌ను ఎత్తుకున్న ఫోటోని చూపించేసరికి "అప్పుడు నన్ను చరణ్ ఎత్తుకున్నాడు... ఇప్పుడు నేను చరణ్‌ను ఎత్తుకోవాలి" అంటూ సరదాగా అన్నాడు వరుణ్. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు చూపించేసరికి స్టూడెంట్స్ నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి. "మీ ఫోన్‌లో లావణ్య గారి కాంటాక్ట్ ఏమని ఉంటుంది" అని ఒక స్టూడెంట్ అడిగింది. దానికి ‘లావ్’ అంటూ సమాధానమిచ్చాడు ఈ హీరో. అప్పుడు సుమ రిలేషన్‌షిప్ మొదలయ్యాక అలా జరిగిందా లేక ముందు నుండి అంతేనా అని అడిగేసరికి లావణ్యనే ఫోన్ తీసుకొని కాంటాక్ట్ మార్చిందని వరుణ్ క్లారిటీ ఇచ్చాడు. " లావణ్యకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏమిటి అని అడిగేసరికి" చాలా ఏళ్ళు ఐపోవడంతో ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గుర్తులేదన్నాడు వరుణ్.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.