English | Telugu

బిగ్ బాస్ సీజన్-7 లోకి ఎంట్రీ ఇవ్వనుంది వీళ్ళేనా!

తెలుగు టెలివిజన్ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా సంచలనం సృష్టిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. September 3న గ్రాండ్ గా మొదలు కాబోతుంది. ఇప్పటికే ప్రేక్షకులకు హైప్ క్రియేట్ చేసే ప్రోమోలు వదిలారు స్టార్ మా మేకర్స్. దాంతో ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయికి చేరాయనడంలో ఆశ్చర్యం లేదు.

గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ సీజన్-7 లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది వాళ్ళు,వీళ్ళు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టినా అందులో కొంతవరకు మాత్రమే నిజం ఉంది. ఈ సీజన్ మొదలు కావడానికి ఇంక కొన్ని రోజుల టైమ్ మాత్రమే ఉండడంతో బిగ్ బాస్ టీమ్ కొంతమంది కంటెస్టెంట్స్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్లతో బిగ్ బాస్ సీజన్ కి సంబంధించిన అగ్రిమెంట్ , వాళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా అందినట్టు సమాచారం. వాళ్లకి సంబంధించిన AV షూటింగ్ కూడా పూర్తి అయిందట. అమర్ దీప్ (సీరియల్ యాక్టర్ ), అతని భార్యతో కలిసి జంటగా బిగ్ బాస్ కి ఎంట్రీ అంటూ అప్పట్లో వార్తలు వచ్చినా, అందులో నిజం లేదు అమర్ దీప్ సింగల్ గానే ఎంట్రీ ఇస్తుండట.. సింగర్ దామిని, బోలె షావలి (ఫోక్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ ), కాస్కో నిఖిల్ (యాంకర్ ), అనిల్ జీల (యు ట్యూబేర్ ), అర్జున్ అంబటి (సీరియల్ యాక్టర్ ), మహేష్ అచంట (కమెడియన్ ), శోభాశెట్టి (సీరియల్ యాక్టర్ ), శుభశ్రీ (హీరోయిన్ ), పూజా మూర్తి (సీరియల్ యాక్టర్ ), గౌతమ్ కృష్ణ (హీరో ), ప్రిన్స్ యావర్ (మోడల్ ).. ఇలా ఇప్పటి వరకు వీళ్ళకి సంబంధించిన అగ్రిమెంట్ లు పూర్తి అయినట్లు సమాచారం. మొత్తం హౌస్ లోకి 21 మంది వెళ్ళనున్నట్లు తెలుస్తుంది.

బిగ్ బాస్ అందరి అంచనాలు తారుమరు చేస్తుంది. అన్ని సీజన్ ల కంటే ఈ సీజన్ ఉల్టా పల్టా అని నాగార్జున ప్రోమో లో ఆల్రెడీ హింట్ ఇచ్చేసాడు.ఇప్పటికి బిగ్ బాస్ సెట్ ప్రోమో షూటింగ్ అంతా పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరున బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన అఫీసియల్ ప్రోమోని విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్ అన్ని సీసన్ ల కంటే బెస్ట్ అనిపించుకుంటుందో లేదో చూడాలి.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.