English | Telugu

అపర్ణపై ఇందిరాదేవీ ఫైర్.. స్పప్న దాచిన నిజం బయటపడనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి.. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-187 లో.. వాంతి చేసుకున్న స్వప్నని హాస్పిటల్ కి తీసుకెళ్తామని రుద్రాణి, రాహుల్ రేడీగా ఉంటారు. స్వప్న టెన్షన్ తో వాళ్ల ఫ్రెండ్ సాక్షికి కాల్ చేయగా.. 'ఈ రోజు నాకు వీలు కాదు. రోజంతా టెంపుల్ లోనే ఉంటాను. మా అత్తయ్య మెక్కుకుందంట' అని స్వప్నతో సాక్షి అనగానే.. నువ్వు ఇలా చేస్తే నన్నెవరు కాపాడేదని స్వప్న ఫీల్ అవుతుంది. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని రకాల టిఫిన్స్ చేసి వాటికి పేర్లు కూడా పెడుతుంది కావ్య. ఎందుకంటే ఎవరు తనతో మాట్లాడట్లేదని ఈ ఐడియా వేస్తుంది కావ్య.

డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరిని పిలవడానికి ఒక గంటను కొడుతుంది. అది విని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. రాగానే ఆ టేబుల్ మీద అన్ని టిఫిన్స్ కి పేర్లు ఉండటం చూసిన సుభాష్ .. ఏంటమ్మ కావ్య, కొత్తగా ఈ పేర్లేంటి అని అడుగుతాడు. కావ్య మౌనంగా ఉంటుంది. ఏంటమ్మా మీ మామయ్య అడుగుతున్నాడు కదా మౌనంగా ఉంటావేంటి సమాధానం చెప్పమని సీతారామయ్య అంటాడు. అది విని ఇందిరాదేవి అందుకుంటుంది. తనేం మాట్లాడదు, తనే కాదు తనతో ఈ ఇంట్లో ఎవరూ మాట్లడట్లేదని ఇందిరాదేవి అంటుంది. ఎందుకని సుభాష్ అడుగుతాడు. నీ భార్య మాకు ఆంక్షలు విధిస్తుంది. తనతో ఎవరూ మాట్లాడకూడదని ఇంట్లో రూల్ పెట్టిందని ఇందిరాదేవీ అనగానే.. ఏంటిది, నేను వాళ్ళ అమ్మనాన్నలకి , ఇక ఇలాంటిది జరుగదని చెప్పి లోపలికి తీసుకొచ్చానని అపర్ణతో సుభాష్ అంటాడు. ఆ రోజు అంత గొడవ జరిగినా మళ్ళీ మట్టి పిసుక్కోవడానికి వెళ్ళిందని అపర్ణ అంటుంది. ఎహే ఆపు .. ఎంత సేపు ఆ మట్టిని మోస్తావని ఇందిరాదేవి అంటుంది. మిమ్మల్ని మాట్లాడొద్దనడం నా తప్పే, నన్ను క్షమించండి. కానీ ఈ మట్టి పిసుక్కోవడం మళ్ళీ జరుగకూడదని అపర్ణ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సుభాష్ కావ్యతో అందరూ మాట్లాడాలని అందరికి చెప్తాడు. ఆ తర్వాత రాజ్ ఇడ్లీ వద్దన్నట్టు హ్యాండ్ ని అడ్డుగా పెడతాడు. ఏంటి నువ్వు కూడా మాట్లాడట్లేదా? ఇంకో ఇడ్లీ వేసుకో అని రాజ్ తో సుభాష్ అనగానే సరేనని రాజ్ ఇడ్లీ వేయమంటాడు.

మరొకవైపు కావ్య కోసం కృష్ణమూర్తి వెయిట్ చేస్తుంటాడు. కనకం చూసి... ఏంటయ్యా తొందరగా వెళ్తానన్నావ్, ఇప్పుడేంటి గుమ్మం వైపు అలా చూస్తున్నావని కృష్ణమూర్తితో కనకం అంటుంది. అది విని కావ్య కోసం చూస్తున్నానని కృష్ణమూర్తి అంటాడు. అప్పుడే కృష్ణమూర్తికి కావ్య కాల్ చేస్తుంది. ఈ రోజు నాకు వీలవ్వదు నాన్న, రేపటిది ఈరోజుది కలిపి రేపే వర్క్ చేస్తానని కావ్య అంటుంది. లేదమ్మ ఇబ్బందిగా ఉందా అను కనకం అంటుంది. అదేం లేదమ్మా రాజ్ వాళ్ళ ఆఫీస్ వర్క్ చేస్తున్నా అని కనకంతో కావ్య అనగానే.. అవునా, నువ్వు ఆఫీస్ కి వెళ్లి హుందాగా ఉండాలని కనకం అంటుంది. నాకు అంతగా ఆశ లేదమ్మా, నన్ను గుర్తిస్తే చాలని కావ్య చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. కోట్ల విలువ కన్నా వ్యక్తిత్వం గొప్పదని కావ్య చెప్తుంది చూసావా కనకం అని కృష్ణమూర్తి అంటాడు. మరొకవైపు హాస్పటల్ లో స్వప్న, రాహుల్, రుద్రాణి వెయిట్ చేస్తుంటారు. దుగ్గిరాల ఇంటికి సబల అనే మహిళ హక్కుల గురించి పోరాడే మహిళా సంక్షేమ ట్రస్ట్ నుండి కొందరు వచ్చి.. మట్టి పిసుక్కునే అమ్మాయిని మీ కోడలిగా చేసుకొని బాగా చూసుకుంటున్నారని వాళ్ళు పొగుడుతుంటే.. అపర్ణ, రాజ్ ఏం మాట్లాడలేకపోతారు. రాజ్, కావ్యని పక్కపక్కకి నిల్చోబెడితే ఫోటో తీసుకొని వెళ్ళిపోతామని ఆ సంక్షేమ ట్రస్ట్ వాళ్ళు చెప్తారు. సరేనంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.