English | Telugu

ఏంజిల్ కోసం రిషి పెళ్ళిపెద్ద అయ్యాడా.. అసలేమైందని జగతి కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -856 లో.. వసుధార, ఏంజిల్ కలిసి రిషితో మాట్లాడతారు. ఏంజిల్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది, మీరేమంటారని రిషిని అడుగుతుంది వసుధార. అప్పుడు రిషి కోపంగా మాట్లాడతాడు. అయినా నా నిర్ణయం ఏంజిల్ కి చెప్పానని రిషి సమాధానం చెప్తాడు.

ఆ తర్వాత తను నా పర్సనల్ విషయంలో కలుగుజేసుకోవడమేంటి? నువ్వు అంటే నా ఫ్రెండ్ వి తనెవరు అని వసుధార గురించి రిషి అంటాడు. దాంతో ఏంజిల్.. తనకి నువ్వు తెలుసు కదా అందుకే అడిగిందని చెప్తుంది. ఆ తర్వాత రిషి కోపంగా వెళ్ళబోతుంటే.. చెయ్యి పట్టుకొని ఆపుతుంది వసుధార. మీరు ఏంజిల్ గురించి ఏదో ఒక క్లారిటీ ఇవ్వండని వసుధార అడుగుతుంది. నేను చెప్పాలిసింది ఎప్పుడో చెప్పానని రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన వసుధార.. ఏంజిల్ గురించి మాట్లాడినప్పుడు, రిషి కోపంగా మాట్లాడిన మాటలు గుర్తుచేసుకొని బాధపడుతుంది. మరొక వైపు రిషి కూడా ఏంజెల్ తరుపున వసుధార మాట్లాడుతుందని ఆలోచిస్తాడు. ఎలాగైనా ఈ విషయం విశ్వనాథ్ సర్ కి చెప్పి, ఏంజిల్ పెళ్లి గురించి మాట్లాడాలని రిషి అనుకొని విశ్వనాథ్ దగ్గరికి వెళ్తాడు. ఏంజిల్ పెళ్లి గురించి మీతో మాట్లాడాలని విశ్వనాథ్ తో రిషి చెప్తాడు. మీరు మీకు తెలిసిన వాళ్లలో ఏంజిల్ గురించి చెప్పి మంచి సంబంధం చూడండి, ఏంజిల్ ని అర్థం చేసుకునేవాళ్ళని చూడవచ్చు కదా అని విశ్వనాథ్ తో రిషి చెప్తాడు.

ఆ తర్వాత తన మనసులో ఎవరో ఉన్నారని చెప్పిందని, ఆ విషయం తనే చెప్తానందని రిషితో విశ్వనాథ్ అంటాడు. అప్పుడే ఏంజిల్ వచ్చి.. ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతుంది. నీ పెళ్లి గురించి, నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యమని రిషి చెప్తున్నాడని విశ్వనాథ్ అనగానే.. రిషి పెళ్లి పెద్ద అయ్యాడా? నేను తర్వాత చెప్తానని విశ్వనాథ్ కి ఏంజిల్ చెప్తుంది. ఆ తర్వాత రిషితో మళ్ళీ తన ఇష్టం గురించి చెప్పాలని ప్రయతించిన రిషి.. తన మనసులో ఉన్న మాటని క్లారిటీ గా చెప్తాడు. మరొక వైపు కాలేజీలో వర్క్ చేసే వాళ్ళకి ఇంకా జీతాలు పడలేదని ఒక ఎంప్లాయి వచ్చి జగతి కి చెప్తాడు. జగతి మేనేజర్ ని పిలిచి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.