English | Telugu

వర్షం వల్ల చందమామ బర్త్ డే?

వర్షం వల్ల చందమామ బర్త్ డే?ఏంటని అర్థం కాలేదు కదా.. చందమామ అనేది పాప పేరు.. అవును నిజమే అంజలి పవన్ వాళ్ళ పాప పేరు 'ఆద్య' ముద్దుపేరు చందమామ. అంజలి పవన్ తన కూతురికి ఇష్టంగా పెట్టుకున్న పేరు 'చందమామ'. అంజలి అత్తోట.. ఈ పేరు ఎవరికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ అంజలి పవన్ అందరికి సుపరిచితమే. కారణం యాక్టర్ పవన్ ని పెళ్ళి చేసుకొని ఫేమస్ అయింది. టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు యాక్టర్ గా మరొకవైపు యాంకర్ గా కెరీర్‌ ని స్టార్ట్ చేసింది అంజలి పవన్.

మొగలిరేకులు సీరియలో నటించిన అంజలి.. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత తనకి బోలెడు సినిమాల్లో, టెలివిజన్ రంగంలో ఆఫర్లు వచ్చాయి. అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంజలి హైదరాబాద్ లో జన్మించింది. తన వ్యక్తిగతంగా, వృత్తిపరంగాను ఎంతో ఉన్నంతంగా ఉంటుందని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లని చూస్తుంటేనే తెలుస్తుంది. అయితే జనవరి 24, 2015 న సినిమా రంగంలో పనిచేస్తున్న సంతోష్ పవన్ ని పెళ్ళిచేసుకుంది అంజలి. అప్పటినుండి తన పేరును అంజలి పవన్ గా మార్చుకుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది అంజలి పవన్. అంజలి తన భర్త పవన్ తో కలిసి 'నీతోనే డ్యాన్స్ షో' లో పర్ఫామెన్స్ చేసింది. వాళ్ళిద్దరి పర్ఫామెన్స్ కి జడ్జ్ లు రాధ, తరుణ్ మాస్టర్, సదా అంతా ఫిధా అయ్యారు‌. ఈ వయసులో ఇంత చక్కగా డ్యాన్స్ చేయడం చాలా కష్టమంటూ రాధ కూడా తనని పొగిడారు.

అయితే బిగ్ బాస్ సీజన్-7 కి తను సెలెక్ట్ అయినట్లు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అంజలి పవన్ యొక్క 'ఇట్లు మీ అంజలిపవన్' యూట్యూబ్ ఛానెల్ లో ఇప్పటికే చాలా రకాల వ్లాగ్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. అయితే తాజాగా వాళ్ళ పాప పుట్టిన రోజు వేడుకని ఘనంగా చేసింది అంజలి పవన్. ' వర్షం వల్ల చందమామ 3rd బర్త్ డే' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేసింది అంజలి పవన్. అయితే ఈ వేడుకకి గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, పాగల్ పవిత్ర, జెస్సీ, ఇంకా చాలా సెలబ్రిటీలు వచ్చారు. అయితే అంజలి పవన్ వాళ్ళ పాప చందమామ బర్త్ డే ని 'సొసైటీ పార్క్' లో అవుట్ డోర్ లో చేశారు. అయితే వర్షం రావడంతో అదంతా ప్లాప్ అయిందని, మళ్ళీ బర్త్ డేకి చేసినవన్నీ వాళ్ళింట్లోకి మార్చేసారని చెప్పింది అంజలి పవన్. బర్త్ డే కి వచ్చిన గెస్ట్ లు అంతా ఎక్కడివాళ్ళు అక్కడే ఉన్నారని, సరిగ్గా పట్టించుకునేంత టైమ్ కూడా లేదని అంజలి పవన్ ఈ వ్లాగ్ లో చెప్పింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.