English | Telugu

బిగ్ బాస్ లోకి  ఆకాశ వీధుల్లో  సినిమా హీరో!

బిగ్ బాస్ హౌస్ లోకి గౌతమ్ కృష్ణ వెళ్ళనున్నాడా అంటే.. అవును వెళ్తున్నాడు. అతనే హింట్ ఇచ్చాడు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అతను వెళ్తాడా లేదా అనే డౌట్ ఉండేది.. కానీ నేటితో అది పక్కా ఫిక్స్ అయింది. తాజాగా‌ గౌతమ్ కృష్ణ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చనింగ్ స్టార్ట్ చేశాడు. అందులో ఒకరు ' సెప్టెంబర్ 3rd వస్తున్నారా' అని అడుగగా.. గుండెల్లోకి డైరెక్ట్ ఎటాక్ అని గౌతమ్ కృష్ణ రిప్లై ఇచ్చాడు.

యంగ్ హీరో గౌతమ్‌ కృష్ణ ఒకవైపు హీరోగా, మరొకవైపు దర్శకత్వం వహించిన సినిమా ‘ఆకాశ వీధుల్లో’. ఈ సినిమా గౌతమ్ కృష్ణకి తొలి సినిమా అయిన ఇప్పటికే చాలా సినిమాలు చేసినంత అనుభవంతో అతను నటించాడు. పూజిత పొన్నాడ, గౌతమ్ కృష్ణ, సత్యం రాజేశ్, దేవి ప్రసాద్ ఫ్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. ఆకాశ వీధుల్లో సినిమా కథేంటంటే.. సిద్ధు (గౌతమ్ కృష్ణ) పెద్ద రాక్‌ స్టార్‌ కావాలని చదువును నిర్లక్ష్యం చేసి తన తండ్రి దేవీ ప్రసాద్ తో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నిషా(పూజితా పొన్నాడ)తో ప్రేమలో పడి కొన్నాళ్ళ తర్వాత నిషాతో మనం లివింగ్ లో ఉందామని చెప్పగా.. నిషా తనకు ప్రేమపై నమ్మకం లేదని చెప్పి, అతనికి దూరంగా ఉంటుంది. దాంతో ప్రేమ విఫలం అయ్యి మద్యపానం, మాదకద్రవ్యాలకు సిద్దు బానిస అవ్వడంతో అతని జీవితం తలకిందులవుతుంది, అతను ఈ సమస్యలన్నింటిని ఎలా ఎదురుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ.

మొదటి సినిమా 'ఆకాశ వీధుల్లో' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్టు తనే ఇన్ స్టాగ్రామ్ లో హింట్ ఇచ్చాడు. ఆస్క్ మి క్వశ్చనింగ్ లో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధనమిచ్చాడు గౌతమ్ కృష్ణ. మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటని ఒకరు అడుగగా.. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 3, అని రిప్లై ఇచ్చాడు గౌతమ్ కృష్ణ. అన్న మీరు బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫిల్మ్స్ లోకి వచ్చారా అని ఒకరు అడుగగా.. అవునని రిప్లై ఇచ్చాడు గౌతమ్ కృష్ణ. నెక్స్ట్ మూవీ ఏంటని అనగా.. త్వరలోనే చెప్తామని అన్నాడు. ' టీవీలో చూడొచ్చా మిమ్మల్ని లైక్ షోస్' అని ఒకరు అడుగగా.. " చూడొచ్చు, చూడాలనుకుంటే చూడొచ్చు" అని గౌతమ్ కృష్ణ రిప్లై ఇచ్చాడు. సెప్టెంబర్ 3rd వస్తున్నారా అంటే డైరెక్ట్ గుండెల్లోకి అని చెప్పిన గౌతమ్ కృష్ణ పక్కాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడా? మరి ఇది నిజమేనా కాదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.