English | Telugu
గదిలోని ఫోటోలని మార్చిందెవరు.. అది చూసి ముకుంద షాక్ !
Updated : Sep 1, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -250 లో.. మురారి క్యాంప్ లో పిల్లలని ఎలా సేవ్ చేసాడో భవానికి చెప్తూ ఉంటాడు. మురారిని చుసిన భవాని.. ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. మరొక వైపు కృష్ణ గదిలోకి వెళ్లి ముకుందతో తను కలిసి ఉన్న ఫోటోలని చూస్తుందేమో అని మురారి టెన్షన్ పడుతుంటాడు.
మరొక వైపు కృష్ణ తన తింగరి పనులు మళ్ళీ మొదలుపెడుతుంది. ఇంట్లో ఎన్ని మెట్లు ఉన్నాయని లెక్కపెడుతుంటుంది. అది చూసిన మురారి ఆశ్చర్యపోయి చూస్తాడు. ఆ తర్వాత మురారి కృష్ణ దగ్గరికి వెళ్లబోతుంటే ముకుంద ఎదురుపడుతుంది. నా ప్రేమని కాదని కృష్ణని ఎలా ప్రేమిస్తావ్? నీ సంగతి చెప్తానని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి ముకుంద వెళ్లి ఏదో ఫొటో చూపిస్తుంది. ఏంటి ముకుంద మేం కలిసి ఉన్న ఫోటో చూపిస్తుందేమోనని మురారి టెన్షన్ పడుతాడు. కానీ ముకుంద మాత్రం మురారిని టెన్షన్ పెట్టాలని అలా చేస్తుంటుంది. ఆ తర్వాత కృష్ణ గదిలోకి వెళ్ళబోతుంటే.. మురారి ఆపుతాడు. ఇప్పుడే వెళ్ళకని, ఎక్కడ ముకుంద మురారి లు కలిసి ఉన్న ఫొటోస్ చూస్తుందని కంగారు పడుతాడు. అప్పుడే ముకుంద కృష్ణ దగ్గరికి వచ్చి.. నీకు సర్ ప్రైజ్ అంటూ కృష్ణ కళ్ళు మూసుకొని.. గదిలోకి తీసుకొని వెళ్తుంది ముకుంద. మురారి టెన్షన్ పడుతుంటాడు.
కృష్ణని ముకుంద తీసుకొని వెళ్లేసరికి గదిలో.. ముకుంద, మురారి ల ఫొటోస్ ఉండవు. వెల్ కమ్ కృష్ణ అని రాసి ఉంటుంది. అది ఎవరు మార్చారని ముకుంద షాక్ అవుతుంది.. అది చుసిన కృష్ణ.. ముకుంద నే అలా చేసిందని అనుకొని థాంక్స్ చెప్తుంది. మురారికి కూడా అది ఎవరు చేశారో అర్థం కాదు.
మరొక వైపు కృష్ణ, మురారి ఇద్దరు హ్యాపీగా ఉండాలని రేవతి దేవుళ్ళకి మొక్కుకుంటుంది. మరొక వైపు ఫొటోస్ ఎవరు మార్చారని మురారి అనుకుంటాడు. ఇంకెవరు అమ్మ మార్చి ఉంటుందని మురారి అనుకుంటాడు. మరొక వైపు మురారికి టాబ్లెట్స్, ఇంజెక్షన్ ఇవ్వడానికి అంతా రెడీ చేస్తుంది కృష్ణ. మురారి భయంతో వెళ్ళాబోతుంటే కృష్ణ ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.