English | Telugu
బిగ్ బాస్ లో ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన అనిల్ జీల!
Updated : Aug 30, 2023
అనిల్ జీల.. 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ తో చాలా మందికి పరిచయం అయినా ఒక యూ ట్యూబేర్... ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు.
యూట్యూబ్ వీడియోల నుండి అనిల్ కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ జీల ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో అనిల్ పెళ్లి చేసుకుని పెళ్లి పత్రిక డిఫరెంట్ గా చేయించాడు. అప్పట్లో అది కాస్త వైరల్ గా మారింది. రీసెంట్ గా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో నటించి తన కామెడీతో అందరిని మెప్పించాడు. ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ తీసుకొని వీడియోలు చేయడం అనిల్ స్టైల్ అనే చెప్పాలి...
అనిల్ జీల సొంతంగా ఒక మూవీ స్క్రిప్ట్ రాస్తున్నాడన్న విషయం తెలిసిందే. అనిల్ జీల రాసిన కథని కొంతమంది ప్రొడ్యూసర్స్ కి కూడా వినిపించాడంట. అయితే ఈ తరుణంలో బిగ్ బాస్ వాళ్ళు తనని అప్రోచ్ అయినట్టు చెప్పాడు. తన గురించి AV కూడా తీసుకొని వెళ్ళారంట. కానీ మళ్ళీ కాల్ రాలేదని అనిల్ జీల అన్నాడు. ఒకవేళ ఎలా ఉంటుందంటు తనవాళ్ళని అడిగి తెలుసున్నాడు అనిల్ జీల. అయితే అందరూ బిగ్ బాస్ లోకి వెళ్తే చాలా క్రేజ్ వస్తుందని చెప్పారంట. వాళ్ళ అమ్మ అయితే చాలా ఎక్సైట్ మెంట్ గా ఫీల్ అవుతుందంట. అనిల్ జీలా వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఇలా బిగ్ బాస్ లోకి రమ్మని పిలిచారని చెప్పగా.. ఒకవేళ నువ్వు వెళ్తే మేమంతా ఫ్యామిలీ వీక్ లో వస్తామంటూ చెప్పిందంట. అయితే ఒకవైపు తను రాసిన కథని ప్రొడ్యూసర్స్ కి వినిపించే పనిలో ఉన్న అనిల్ జీల.. బిగ్ బాస్ లోకి వెళ్తాడా లేదా అనేది క్లారిటీ లేదు. తనేమో ఇక వెళ్ళను అని చెప్పాడు. మరో వారంలో మొదలయ్యే బిగ్ బాస్ లో ఇంకా ఎవరు వెళ్తారనే క్లారిటీ లేకుండా అంతా ఉల్టా పల్టా చేస్తున్నారని టాక్ నడుస్తుంది. మరి మై విలేజ్ షో అనిల్ జీల బిగ్ బాస్ లోకి వెళ్తాడా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.