English | Telugu

బిగ్ బాస్ సీజన్-7లోకి షకీలా ఎంట్రీ ఇవ్వనుందా?

కొన్ని నెలల నుండి బిగ్ బాస్ సీజన్-7 గురించి ప్రతీ ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ టైమ్ రానే వచ్చింది. మరో వారంలో బిగ్ బాస్ సీజన్-7 తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. అయితే ఇందులోకి వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. అయితే ఈ సారి కాస్త భిన్నంగా ఉండబోతుందంట బిగ్ బాస్. ఎవరూ ఊహించనివిధంగా ఈసారి ఉండబోతుందన్నట్టుగా ఇప్పటికే ప్రోమోలో నాగార్జున చెప్పాడు.

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేది ఎవరనే ఆసక్తితో పాటు కంటెస్టెంట్స్ లిస్ట్ లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొగలిరేకులు ఫేమ్ సాగర్ కన్ఫమ్ అని వినిపిస్తుంది. కార్తీకదీపం సీరియల్ ఫేమ్ మోనిత అలియాస్ శోభిత శెట్టి కూడా వెళ్తున్నట్టు సమాచారం. అయితే ఒకరు మీడియా నుండి వెళ్తున్నట్టుగా ఉంది కానీ అది ఎవరనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. ‌అయితే రెగ్యులర్ కంటెస్టెంట్స్ కి కాస్త భిన్నంగా కొత్త కంటెంట్ తీసుకరావడానికి 'షకీలా' ని తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. తనతో ఆల్రెడీ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటం కూడా జరిగిందంట. ఈ సారి షకీలాని పాజిటివ్ గా చూపించడానికి ఒక పవర్ ఫుల్ 'AV' ని కూడా షూట్ చేసారంట. తను ఎన్నో బీ గ్రేడ్ సినిమాల్లో చేసాక తనకి చాలా అవమానాలు ఎదురయ్యాయంట.

డబ్బుల కోసం వాళ్ళ అమ్మ మొదటిసారి షకీలాని అక్కడికి పంపించందంట. అయితే తను అప్పుడు ప్లే గర్ల్స్ అనే పిక్చర్ ఓకే అయిందంట. అదే టైమ్ లో డబ్బులకి ఇబ్బంది అవుతుందని వాళ్ళ అమ్మ పంపించిందంట. వాళ్ళ అక్కతోనే షకీలా వెళ్ళిందని ఒక ఇంటర్వూలో చెప్పింది‌. కాగా ఇలా తను ఇలా అవడానికి కారణమేంటి? ఎందుకిలా జరిగిందని షకీలా చాలాసార్లు చెప్పుకొని బాధపడింది. అయితే తన గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలని చూపిస్తూ, తన ఆఫ్ స్క్రీన్ లైఫ్ ఎలా ఉందని షార్ట్ వీడియో తీసారంట బిగ్ బాస్ మేకర్స్. అయితే తను కూడా ఒక ఆడదే, తనకి సమాజంలో సరైన గుర్తింపు లేదంటూ సమాజానికి చెప్పేలా తనని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేయాలని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తుందంట. అందుకే ఈ సారి తనని బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నారంట. మరి షకీలా కన్ఫమా కాదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.