English | Telugu

పెళ్ళి అయిన తర్వాత నా ఫస్ట్ రాఖీ పండుగ!

అమ్మాయిలకి పెళ్ళికి ముందు ఒక ప్రపంచం పెళ్ళి తర్వాత మరొక ప్రపంచం అనిపిస్తుంది. ముఖ్యంగా రాఖీ పండుగకి అన్నని, లేదా తమ్ముడిని మిస్ అవుతున్న ఫీలింగ్ ప్రతీ ఒక్క అమ్మాయికి ఉంటుంది. రాఖీ పండుగకి తన అన్నయ్యతో అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు మా అత్తగారింట్లో ఉన్నా అంటూ ఎమోషనల్ వీడియోని అప్లోడ్ చేసింది యాదమరాజు భార్య స్టెల్లా. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో యాదమరాజు ఒకడు‌. యాదమరాజు కామెడీ టైమింగ్ తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. అంతేకాదు పటాస్ షో లో తన పంచ్ లతో అప్పట్లో నవ్వులు పూయించాడు.

జబర్దస్త్ లోని అన్ని టీమ్స్ లో ఒక కంటెస్టెంట్ గా చేసిన యాదమరాజు తాజాగా కొత్త టిమ్ తో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే యాదమరాజు, స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అప్పటి నుండి స్టెల్లాతో కలిసి వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఏ ఈవెంట్ కి వెళ్ళినా, ఏ టూర్ కి వెళ్ళిన వ్లాగ్ చేసి తమ యూట్యూబ్ ఛానెల్ ' స్టెల్లారాజ్ 777' లో ఇద్దరు కలిసి అప్లోడ్ చేస్తున్నారు. అమెరికాలో జాబ్ చేసి వచ్చిన స్టెల్లా, యాదమరాజుని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. వీళ్ళిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో హిలేరియస్ స్కిట్లు చేశారు. తమ యూట్యూబ్ ఛానెల్ ఇప్పటికే ఎనిమిది లక్షల మంది సబ్ స్కైబర్స్ కలిగి ఉంది. కాగా వీళ్ళు చేసిన వ్లాగ్స్ అన్నీ దాదాపు లక్షకు పైగా వ్యూస్ వస్తున్నాయి.

పెళ్ళి అయిన కొత్తల్లో అత్తగారింట్లో, మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్, లాస్ట్ డే ఇన్ ఇండియా, హోమ్ టూర్ ఇలా పాపులర్ అయిన వ్లాగ్స్ చాలానే ఉన్నాయి. అయితే కొన్ని వారాల క్రితం యాదమరాజుకి యాక్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? ఎలా జరిగింది? యాక్సిడెంట్ తర్వాత ఎలా ఉన్నాడో చెప్తూ 'మా ఆయన యాక్సిడెంట్ తర్వాత ఎలా అయ్యాడంటే' అనే వ్లాగ్ చేసి తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది స్టెల్లా. అయితే తాజాగా పెళ్ళి అయిన తర్వాత నా ఫస్ట్ రాఖీ పండుగ అనే వ్లాగ్ చేసింది స్టెల్లా. ఇందులో తన అన్నతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో చెప్పుకొచ్చింది స్టెల్లా. వాళ్ళ అన్నకి స్టెల్లా రాఖీ కట్టిన తర్వాత కొన్ని డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత తనకి గిఫ్ట్ ఏదని స్టెల్లా అడుగగా.. తనకోసం తీసుకున్న చీరని ప్రెజెంట్ చేశాడు వాళ్ళ అన్న. ఇదంతా ఎమోషనల్ గా సాగింది. 'జీవితం గడిచేకొద్దీ మనం మారవచ్చు, మన మార్గాలు మారవచ్చు. అన్నా చెల్లెల్ల బంధం ఎప్పటికీ మారదు' అని మెసెజ్ ఇచ్చారు స్టెల్లా యాదమరాజు దంపతులు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.