English | Telugu
భర్త రణ్‌బీర్‌తో ఆలియాకి క్లాష్?
Updated : Jun 18, 2023
భర్త రణ్‌బీర్ కపూర్‌తో ఆలియాభట్‌కి క్లాష్ రాబోతోందని రాస్తోంది నార్త్ మీడియా. దీనికి కారణం వారిద్దరూ నటించిన సినిమాలే. ఆలియా నటించిన హాలీవుడ్ సినిమా ది హార్ట్ ఆఫ్ స్టోన్. ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్. టామ్ హార్పర్ తెరకెక్కించిన సినిమా ఇది. గాల్ గడట్, జమీ డోర్నన్ ఇతర పాత్రల్లో నటించారు. ఆలియా భట్‌కి తొలి హాలీవుడ్ సినిమా ఇదే. ఈ చిత్రం ట్రైలర్ ఆదివారం ప్రేక్షకులను పలకరిస్తుంది. ఆలియాభట్ ఈ సినిమాకు పనిచేసే సమయంలో గర్భవతి.
పెళ్లయ్యాక ఆలియా భట్ ఈ సినిమా షూటింగ్‌కి హాజరయ్యారు. ఈ సినిమా ఎన్నో రకాలుగా ఆలియాకు ఎమోషనల్ కనెక్షన్ ఉన్న మూవీ. ఈ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆగస్టు 11న ఓటీటీలో సినిమా విడుదల కానుంది.
మరోవైపు రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారు. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన వస్తోంది. రష్మిక హీరోయిన్‌గా నటించారు.
పెళ్లయ్యాక ఆలియా, రణ్‌బీర్ నటించిన బ్రహ్మాస్త్ర విడుదలై మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రణ్ బీర్ సినిమాలు రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు భార్యాభర్తలు తొలిసారి బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నారు. అయితే రణ్‌బీర్ థియేటర్‌లో, ఆలియా ఓటీటీలో రిలీజులను చూస్తుండటంతో పోటీ తీవ్రత పెద్దగా లేదు.
ఆగస్టులో హాలీవుడ్ సినిమా కన్నా ముందే జులై 28న ఆలియాకు రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ విడుదలవుతుంది. సో వచ్చే నెల నుంచే ఆలియా ఇంటర్నేషనల్ వైడ్ ప్రమోషన్లలో బిజీగా ఉంటారన్నమాట.