English | Telugu
రణ్‌వీర్‌కి హెల్ప్ చేస్తున్న షారుఖ్
Updated : Jun 19, 2023
షారుఖ్ ఖాన్ ఇప్పుడు బాలీవుడ్‌లో అన్నిటికీ ముందుంటున్నారు. త్వరలోనే రణ్‌వీర్ కోసం కూడా సోషల్ మీడియాలో ఓ సాయం చేయడానికి రెడీ అవుతున్నారు. రణ్‌వీర్ సింగ్, ఆలియా కలిసి నటిస్తున్న సినిమా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ. ఈ సినిమా టీజర్ షారుఖ్ చేతుల మీదుగా విడుదల కానుంది. కరణ్ జోహార్ ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఈ టీజర్ లాంచ్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.
1998లో షారుఖ్‌ఖాన్, కాజోల్, రాణీ ముఖర్జీ నటించిన కుచ్ కుచ్ హోతా హైతో ఇండస్ట్రీలో జర్నీ మొదలుపెట్టారు కరణ్‌జోహార్. పాతికేళ్ల జర్నీ చాలా మెమరబుల్ అంటారు కరణ్. ఈ సమయంలో తెరకెక్కించిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ చాలా స్పెషల్ . ఇందులో రణ్‌వీర్, ఆలియాతో పాటు ధర్మేంద్ర, షబానా ఆజ్మీ, జయా బచ్చన్ కూడా నటించారు. ``షారుఖ్, కరణ్‌కి చాలా మంచి అనుబంధం ఉంది. షారుఖ్ ఈ టీజర్‌ని డిజిటల్‌లో లాంచ్ చేయడానికి అంగీకరించారు. ఏ దిల్ హై ముష్కిల్‌లో కరణ్ కోసం షారుఖ్ కేమియో కూడా చేశారు. కరణ్ డైరక్ట్ చేస్తున్న ఏడో సినిమా ఇది``అని అన్నారు మేకర్స్. కుచ్‌కుచ్ హోతా హై తర్వాత కరణ్ కభీ ఖుషి కభీ గమ్, ఖబీ అల్విద నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ చిత్రాలకు డైరక్ట్ చేశారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ నెల 20న టీజర్‌ని, జులై 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గట్టిగా 40 రోజులు ప్రమోషన్ చేయాలన్నది టీమ్ ప్లాన్. టీజర్ ఒక్క నిమిషం 16 సెకన్ల పాటు సాగుతుంది. సినిమాలో ఉన్న గ్రాండియర్‌నంతా ఇందులో చూపించనున్నారు. విజువల్స్, స్టార్ కాస్ట్, సోల్‌ఫుల్ మెలోడీ చూపరులను ఆకట్టుకుంటాయన్నది యూనిట్ ఇస్తున్నవర్డ్.