English | Telugu

తన బేబీని పరిచయం చేస్తున్న శ్రీదేవి కూతురు!

శ్రీదేవి ప్రాణాల‌తో ఉంటే జాన్వీక‌పూర్ కెరీర్ ఎలా ఉండేదో క‌దా! అని అనుకోని వారు అరుదుగా ఉంటారు. స‌రిగ్గా, జాన్వీ స్క్రీన్ ఎంట్రీ టైమ్‌కి శ్రీదేవి లేక‌పోవ‌డం అనేది ఎంత బాధ‌కు గురిచేసిన‌ విష‌య‌మో. అయితే పెద్ద‌మ్మాయి జాన్వీకి జ‌రిగిన లోటు చిన్న‌మ్మాయి ఖుషి విష‌యంలో క‌నిపించ‌డం లేదు. అందుకు కార‌ణం కూడా జాన్వీనే. త‌న త‌ల్లి ప్రాణాల‌తో ఉంటే ఏం చేసేదో, జాన్వీ ఇప్పుడు అచ్చం అలాగే చేస్తోంది.

ఖుషిని త‌న బేబీ అంటూ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తోంది. జాన్వీక‌పూర్ చెల్లెలు ఖుషి క‌పూర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. జోయా అక్త‌ర్ ది ఆర్చీస్‌లో న‌టిస్తోంది ఖుషీ. సుహానా ఖాన్, అగ‌స్త్య నంద ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ది ఆర్చీస్ కొత్త పోస్టర్‌ని విడుద‌ల చేసింది టీమ్‌. న‌టీన‌టులంద‌రూ రెట్రో లుక్‌లో అద‌ర‌గొడుతున్నారు. ఖుషీ క‌పూర్ గురించి జాన్వీ క‌పూర్ ఆనందంగా ఉంది.

పోస్ట‌ర్‌లో ఖుషీ లెఫ్ట్ సైడ్ ఉంది. బ్రౌన్ వేవీ హెయిర్‌తో, పీచ్ టాప్‌తో, ప్రింటెడ్ ఆఫ్ వైట్ కార్డిగ‌న్‌తో, గ్రే అండ్ ఎల్లో చెక్డ్ స్క‌ర్ట్ తో క‌నిపించింది ఖుషి. నెట్‌ఫ్లిక్స్ లో త్వ‌ర‌లో ది ఆర్చీస్ గ్యాంగ్ వ‌స్తోంది అని రాసుకుంది ఖుషి. చెల్లెలు ఆనందాన్ని షేర్ చేసుకుంది అక్క జాన్వీ క‌పూర్‌. త‌న చెల్లెని ప్రిన్సెస్ అంటూ పొగిడింది. నా బేబీని చూడండి. త‌నో ప్రిన్సెస్ అంటూ జాన్వీ త‌న అనుబంధాన్ని షేర్ చేసుకున్న విధానం ప‌లువురి మ‌న‌సుని తాకింది. ఖుషీతో త‌న‌ది ప్ర‌త్యేక‌మైన అనుబంధం అని అంటోంది జాన్వీ. తాను నిద్ర‌లోకి జారుకునే వర‌కు ఖుషి త‌న‌తో ఉండాల‌ని అనుకుంటుంద‌ట జాన్వీ. పొద్దున లేవ‌గానే ఖుషిని చూడాల‌నుకుంటుంద‌ట‌. త‌న‌తో టైమ్ స్పెండ్ చేయ‌క‌పోతే ఖుషిని ఇరిటేట్ చేస్తుంద‌ట జాన్వీ.